Site icon HashtagU Telugu

TTD Meeting : టీటీడీ పాలకమండలి.. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన చివరి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..

TTD last Meeting under YV Subbareddy TTD Meeting Decisions list

TTD last Meeting under YV Subbareddy TTD Meeting Decisions list

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కొత్త చైర్మన్ గా ఇటీవలే భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy)ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) పదవీకాలం ముగిసింది. అయితే నేడు వైవీ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి చివరి సమావేశం(TTD Meeting) జరగగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.

నేడు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

#మెట్ల మార్గం భక్తుల కోసం నరసింహస్వామి ఆలయం వద్ద నుండి 4 కోట్లతో మోకాలి మిట్టవరకు షెల్టర్ నిర్మాణం

#తిరుమల రింగ్ రోడ్ లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం 2.24 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్

#24 కోట్లతో మొదటి ఘాట్ లో రక్షణ గోడల నిర్మాణానికి ఆమోదం

#4.50 కోట్లతో అన్నప్రసాదం భవనంలో వంట సామాగ్రి కొనుగోలు చేయాలని నిర్ణయం

#తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దేవాలయంలో 23 కోట్లతో వైకుంఠం కాంప్లెక్స్ తరహాలో క్యూలైన్ల ఏర్పాటు

#పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి 75.86 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయం

#శ్రీనివాస సేతు వద్ద రూ.3 కోట్లతో సబ్ వే నిర్మాణం

#3.10 కోట్లతో శ్రీనివాస మంగాపురం అభివృద్ది కార్యక్రమాలు

#శ్రీనివాస సేతు పనులకు 118 కోట్లు పెండింగ్ ఉన్నాయి. వర్కు పూర్తి అయిన తరువాత ఇవ్వాలని నిర్ణయం

#శ్రీవారి ఆలయంలో నైవేద్యం ప్రసాదాల తయారీ కోసం టీటీడీ డైరీలో నెయ్యి ప్లాంట్ కోసం 4.50 కోట్లు

#టీటీడీ 69 ప్రాపర్టీలకు ఫెన్సింగ్ కోసం 1.69 కోట్లు కేటాయింపు

#11.50 కోట్లతో ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు ఫ్లోర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

#2.20 కోట్లతో టిబి వార్డు నిర్మాణం చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక చివరి సమావేశం అనంతరం తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఇన్నాళ్లు తనకు సపోర్ట్ చేసిన టీటీడీ ఉన్నతాధికారులకు వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.