Site icon HashtagU Telugu

TTD : ఆ మూడు రోజుల్లో తిరుమ‌లలో గ‌దులు కేటాయింపు ఉండ‌దు.. కార‌ణం ఇదే..?

Tirumala

Tirumala

తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి టీటీడీ నిబంధ‌న‌లు విధించింది. డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ వ‌ర‌కు టీటీడీ ట్ర‌స్టులు, స్కీముల దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్ర‌యోజ‌నాల వివ‌రాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌నం బుక్ చేసుకున్న దాత‌ల‌ను రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న క్యూలైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. దాత‌లంద‌రికీ జ‌య‌విజ‌యుల వ‌ద్ద నుండి మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేయ‌డంలో భాగంగా వైకుంఠ ఏకాద‌శి రెండు రోజుల ముందు నుండి ద్వాద‌శి వ‌ర‌కు అనగా డిసెంబ‌రు 21 నుండి 24వ తేదీ వ‌ర‌కు, అదేవిధంగా డిసెంబ‌రు 30 నుండి జ‌న‌వ‌రి 2024 ఒక‌టో తేదీ వ‌ర‌కు దాత‌ల‌కు, వారి సిఫార్సు లేఖ‌ల‌తో వ‌చ్చే వారికి గ‌దుల కేటాయింపు ఉండ‌దు.

We’re now on WhatsApp. Click to Join.

మిగ‌తారోజుల్లో దాత‌లు య‌థావిధిగా గ‌దులు బుక్ చేసుకోవ‌చ్చని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న ఆదివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 18న శ‌నివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

Also Read:  Andhra Pradesh : ఏపీలో మందుబాబుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్‌.. మ‌ద్యం ధ‌ర‌లు పెంచుతూ ఉత్త‌ర్వులు

Exit mobile version