Site icon HashtagU Telugu

TTD: టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ర‌మ‌ణ దీక్షితులుపై వేటు

Ramana Deekshitulu

Ramana Deekshitulu

TTD: టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీతోపాటు ప్ర‌భుత్వంపైన తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన తిరుమ‌ల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది.

తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా, గౌరవ సలహాదారుగా రమణ దీక్షితులు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సోమవారం సమావేశమైన టిటిడి ట్రస్ట్ బోర్డు రమణ దీక్షితులపై వేటు వేసింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా టిటిడిపై ఆరోపణలు చేసినందుకు తక్షణమే ఆయనను తొలగించాలని తీర్మానం చేసింది. తిరుమల ఆలయంలో ఆచార వ్యవహారాల్లో చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఈవో ఏవీ ధర్మారెడ్డి క్రైస్తవుడని రమణ దీక్షితులు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. అయితే భక్తులను గందరగోళానికి గురిచేయడానికి ఇది కల్పితమని టిటిడి చెప్పింది. కాగా ఆ వీడియోపై రమణ దీక్షితులు మాట్లాడుతూ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా.. ఈవోకీ వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు

టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో రమణ దీక్షితులు అమర్యాదగా ప్రవర్తించారని, అలాగే నిరీక్షిస్తున్న ఆరోపణల్లో నిజం లేదని గుర్తించి, గౌరవ ప్రధాన అర్చకులు మరియు ఆగమ సలహాదారు పదవి నుండి ఆయనను తొలగించాలని నిర్ణయించారు. ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్ర‌క‌టించారు.

Also Read: Telangana: నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్ కసరత్తు