Site icon HashtagU Telugu

TTD : 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ..ఎందుకంటే..?

Ttd Governing Body Will TTD Governing Body will meet urgently on 31st of this month.

TTD Governing Body will meet urgently on 31st of this month.

TTD : ఈ నెల 31న టీటీడీ పాలక మండలి బోర్డు అత్యవసరంగా సమావేశం కానుంది. వచ్చే నెల 3న తిరుమలలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల సందర్భంగా ఏర్పాట్ల పై న సమావేశం కావాలని నిర్ణయించారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత రథసప్తమి వేళ భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ముందుగానే ఏర్పాట్ల పైన సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఇప్పటికే రథసప్తమి పై పలు నిర్ణయాలు తీసుకుని భక్తులకు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు…బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.

ఈక్రమంలోనే  పాలకమండలి..టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివనున్నారు.  ఫిబ్రవరి 4న ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి.  జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అష్టాదళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేసారు. ఎన్‌ఆర్‌ఐలు, సీనియర్ సిటిజన్లు, చంటి బిడ్డల తల్లిదం డ్రులు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయటం లేదని ప్రకటించారు. కాగా, తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర.. తిరుపతి తొక్కిసలాట ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. దీంతో ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

Read Also: BRS- Congress : ఒకటైన కాంగ్రెస్..బిఆర్ఎస్ ..?