Garimella Balakrishna: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ మృతి

గరిమెళ్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలుపుతున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటని ఆయ‌న అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Garimella Balakrishna

Garimella Balakrishna

AP: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ (Garimella Balakrishna) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆయన వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు, తదితర కీర్తనలకు స్వరాలు సమకూర్చారు. గరిమెళ్ల మృతి పట్ల టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సంతాపం తెలిపారు.

Also Read: US Vs NATO : ‘నాటో’ నుంచి అమెరికా బయటికొస్తుందా ? వాట్స్ నెక్ట్స్ ?

గరిమెళ్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలుపుతున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటని ఆయ‌న అన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడుగా గరిమెళ్ల విశేష సేవలందించారు. వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన ఘనత గరిమెళ్ల సొంతం. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ప్రసిద్ధులు.

  Last Updated: 09 Mar 2025, 08:08 PM IST