తిరుపతిలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు మరో ముగ్గురిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 25న తిరుపతి ఎన్జీవో కాలనీలో నివాసముండే వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేటు హాస్పటల్ లో బాధితుడు చికిత్స పొందుతున్నారు.శివారెడ్డి నివాసం ఉండే ఆపార్ట్ మెంట్ ముందే బైక్‌తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లుగా గుర్తించారు. కత్తితో తలపై నరకడంతో శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే, హత్యాయత్నం చేసిందెవరో సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా లేకపోవడంతో.. పోలీసులు శివారెడ్డితో శత్రుత్వం ఉన్నది ఎవరితో అనేదానిపై ఆరా తీశారు.
We’re now on WhatsApp. Click to Join.
అపార్ట్‌మెంట్‌లో వెంకటశివారెడ్డి ఫ్లాట్‌కు ఎదురుగా నివాసముండే శ్రీలక్ష్మి దంపతులు ఆయనతో గతంలో అనేకసార్లు గొడవకు దిగారు. శివారెడ్డి, శ్రీలక్ష్మి ఈ విషయంలో అనేక సార్లు గొడవ పడ్డారు. రెండు కుటుంబాల వారు సమస్యల విషయంలో వెనక్కి తగ్గకుండా ఈగో సమస్యలకు పోవడంతో అవి మరింత పెరిగుతూ పోయాయి. చివరికి హత్యాయత్నానికి దారి తీసింది. కాగా, శివారెడ్డిని అడ్డు తొలగించుకోవాలని భావించిన… శ్రీలక్ష్మి దంపతులు అతనిపై సుపారీ గ్యాంగ్‌తో హత్యాయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం శివారెడ్డి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో శ్రీలక్ష్మి దంపతులే.. ఈ హత్యాయత్నానికి కారణంగా గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు.
Read Also : Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంపం.. భారత్‌లోని ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభావం..!