Site icon HashtagU Telugu

TTD: తిరుమ‌ల చుట్టూ వ‌రుస వివాదాలు.. కార‌కులెవ‌రూ..?

Tirumala Weather

Tirumala Weather

TTD: తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాది మందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.

అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమ‌ని టీటీడీ ప్ర‌క‌టించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్త‌వానికి చాలా దూరంగా ఉన్నాయ‌ని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్ర‌తిరోజూ వేలాది మంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ వారు అన్నప్రసాదాలను తయారుచేస్తారు. అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరంగా ఉంది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా ఉర్రి ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమేగా భావించాల్సి వస్తుంది. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇలాంటి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తే క‌ఠినంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని టీటీడీ తెలిపింది.

Also Read: Fake Gold Flake : హైదరాబాద్‌లో రూ. కోటి విలువైన ఫేక్‌ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు సీజ్‌

ఇప్ప‌టికే తిరుప‌తి ల‌డ్డూపై కొన‌సాగుతున్న వివాదం మ‌న‌కు తెలిసిందే. తాజాగా అన్న‌ప్ర‌సాదంలో జెర్రి అనే వార్త‌లు రావ‌టంతో భ‌క్తులు టీటీడీ అధికారుల‌పై మండిప‌డుతున్నారు. ప్రభుత్వం, యంత్రాంగం మారినా శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి తిరుమలలో పరిస్థితి మారదా అంటూ ఆ భక్తులు ప్రశ్నించారు. జెర్రి వచ్చిన విషయాన్ని ప్రశ్నిస్తే వెళ్లిపొమ్మన్నారని, పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం, టీటీడీ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను మీడియా ప్రతినిధులతో కూడా పంచుకున్నారు. ఇక‌పై తిరుమ‌ల‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని భ‌క్తులు అధికారుల‌ను కోరుతున్నారు. అయితే టీటీడీ ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి ఉప‌యోగించార‌నే వార్త‌లు వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచి ప్రతిరోజు ఏదో ఒక్క వార్త టీటీడీ గురించి వైర‌ల్ అవుతుంది. దీంతో దీనికి గ‌ల కార‌ణం ఎవ‌రు..? వైసీపీ కావాల‌నే దుష్ప్ర‌చారం చేస్తుందా..? లేక నిజంగానే భ‌క్తులు ఆరోపిస్తున్న ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా? అనేది ప్ర‌శ్న‌లుగానే మిగిలిపోతున్నాయి.