Tirumala and Shivaji: మ‌హారాష్ట్ర‌లో `జ‌గ‌న్`వ్య‌తిరేక యుద్ధం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌పంచ ప‌విత్ర ఆధ్మాత్మిక కేంద్రం. అక్క‌డ ఏ చిన్న పొర‌బాటు జ‌రిగిన‌ప్ప‌టికీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేది భ‌క్తుల విశ్వాసం.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 09:25 PM IST

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌పంచ ప‌విత్ర ఆధ్మాత్మిక కేంద్రం. అక్క‌డ ఏ చిన్న పొర‌బాటు జ‌రిగిన‌ప్ప‌టికీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేది భ‌క్తుల విశ్వాసం. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత ఆధ్యాత్మిక క్షేత్రం త‌ర‌చూ ఏదో ఒక రూపంలో చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చేలా టీటీడీ పాలక మండ‌లి వ్య‌వ‌హ‌రిస్తోంది. హిందూయేత‌ర ఉద్యోగులు తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను పాడుచేస్తున్నార‌ని జ‌గ‌న్ సీఎం అయిన తొలి రోజుల్లో వ‌చ్చిన చ‌ర్చ‌. ఆ త‌రువాత తిరుమ‌ల‌కు వెళ్లే బ‌స్సు టిక్కెట్ల వెనుక జెరూస‌లెం యాత్ర‌కు సంబంధించిన ప‌బ్లిసిటీ వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌చ్చింది. ఆ త‌రువాత తిరుమ‌ల ప‌రిస‌రాల్లో క్రిస్టియానిటీని ప్ర‌మోట్ చేస్తోన్న వ్య‌క్తులు ఉండ‌డం వివాదం అయింది.
తాజాగా మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను ప్ర‌శ్నించేలా టీటీడీ పాల‌క మండ‌లి వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. అంతేకాదు, `బాయికాట్ తిరుప‌తి` పేరుతో మ‌హారాష్ట్ర అంత‌టా విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ విష‌యాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు వ‌ల్ల తిరుప‌తితో పాటు మొత్తంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే చెడ్డ పేరు వ‌స్తోంద‌ని హైద‌రాబాద్‌లోని గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం మ‌హారాష్ట్ర సోష‌ల్ మీడియాలో ‘బాయికాట్ తిరుపతి’ పేరిట జ‌రుగుతున్న ప్ర‌చారం వైర‌ల్‌గా మారింద‌ని ఆవేద‌న చెందారు. జ‌గ‌న్ త‌ప్పుడు నిబంధన‌లే ఈ వివాదానికి కార‌ణ‌మ‌ని కూడా రాజాసింగ్ ఆరోపించారు.
మ‌హారాష్ట్రలో ‘బాయికాట్ తిరుప‌తి’ పేరిట ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని సింగ్ తెలుపుతూ అందుకు కార‌ణాన్ని వివ‌రించారు. అలిపిరి వ‌ద్ద వాహ‌నాల‌పై ఉన్న హిందూ దేవుళ్ల చిత్ర‌ప‌టాల‌ను సెక్యూరిటీ తొల‌గిస్తున్నారు. వాహ‌నాల‌పై శివాజీ చిత్రాల‌ను అలిపిరి వ‌ద్ద చించేస్తున్నారు. ఈ పరిణామం మ‌హారాష్ట్రలో పెద్ద వివాదంగా మారింది. ఆ విష‌యాన్ని రాజాసింగ్ మీడియాకు వెల్లడిస్తూ జ‌గ‌న్ ఏ దేవుడిని న‌మ్ముతారో దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసని గుర్తు చేశారు. జ‌గ‌న్ తీరుతో తిరుప‌తికి, ఏపీకి చెడ్డ పేరు వస్తోంద‌ని సింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు.
మ‌హారాష్ట్ర‌లోని చాలా ప్రాంతాల్లో శివాజీని దైవంలా కొలుస్తారు. ఆయ‌న విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాల‌ను ఆరాధిస్తారు. ఏ మాత్రం శివాజీకి అవ‌మానం జ‌రిగినా మ‌హారాష్ట్రీయులు అంగీక‌రించ‌రు. పైగా హిందుత్వం బ‌లంగా ఉన్న రాష్ట్రంగా కూడా మ‌హారాష్ట్ర‌కు పేరుంది. హిందూ దేవుళ్ల‌ను ఎక్కువ‌గా పూజిస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్రమాల‌ను కూడా ఎక్కువ‌గా చేస్తారు. ఆ రాష్ట్రం నుంచి దేవ‌దేవుని ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. ఎప్పుడూ జ‌ర‌గ‌ని అవ‌మానం ఇప్పుడు అలిపిరి వ‌ద్ద శివాజీ చిత్ర‌ప‌టాల‌కు జ‌రుగుతుంద‌ని మ‌హారాష్ట్ర భ‌క్తులు మ‌న‌సు నొచ్చుకుంది. అంతే, `బాయికాట్ తిరుప‌తి` అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నారు. హిందూ సెంటిమెంట్ ను ఏపీ సీఎం జ‌గ‌న్ అవ‌మానిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన రాజాసింగ్ ఏపీ రాష్ట్రానికి జ‌గ‌న్ చెడ్డ పేరు తీసుకొస్తున్నార‌ని మీడియా ముందుకొచ్చారు. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.