Site icon HashtagU Telugu

Tiruptathi : తిరుప‌తిలో డబుల్ డెక్కర్ బస్‌ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మ‌న్ భుమ‌న

TTD

TTD

తిరుప‌తి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సును టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష జెండా ఊపి ప్రారంభించారు. ఎస్.పి.జే.ఎన్.ఎం. క్రీడా మైదానంలో ఈ బస్ ను ప్రారంభించారు. అక్కడ నుండి జ్యోతి థియేటర్ కూడలి, టౌన్ క్లబ్, ఎస్వీ యూనివర్సిటీ వరకు వెళ్లి అక్కడ నుండి టౌన్ క్లబ్ కూడలి మీదుగా అలిపిరి కూడలి, కపిలతీర్థం కూడలి వరకు వెళ్ళి శ్రీనివాస సేతు మీదుగా మామిడి కాయల మండి వరకు, అక్కడ నుండి తిరిగి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం వరకు ఈ బస్ లో టీటీడీ ఛైర్మన్, మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు ప్రయాణించారు. అనంతరం గంగమ్మ ను దర్శించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ డబుల్ డెక్కర్ బస్ ను తిరుపతిలో ఏర్పాటు చేయడం సంతోషమ‌ని టీటీడీ ఛైర్మ‌న్ భుమన క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నదని, కౌన్సిల్ ఆమోదంతో ఈ బస్ ను నగరపాలక సంస్థ కొనుగోలు చేశామన్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి అందాలను వీక్షించేందుకు వీలుగా ఈ డబుల్ డెక్కర్ బస్ ను ఏర్పాటు చేశామ‌ని.. వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భూమ‌న తెలిపారు. ఈ బస్ నాలుగు మార్గాల్లో నడవ‌నుంద‌నిజ‌. ఈ ఎలక్ట్రిక్ ఏ.సి. బస్ నిర్వహణను పరీక్షించిన తరువాత మరో నాలుగు బస్సులను అందుబాటులోనికి తెస్తామని భుమ‌న తెలిపారు.

Also Read:  KTR vs Revanth Reddy : రేవంత్ రెడ్డి ఫై కేటీఆర్ విమర్శలు..అమరుల పేరు ఎత్తే కనీస అర్హత లేదు