Site icon HashtagU Telugu

TTD Alipiri Sticks : ఇవాళ్టి నుంచే భక్తులకు కర్రలు.. చిరుతలతో పోరాడామని కాదు.. టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే..

TTD Chairman Bhumana Karunakar Reddy starts giving Sticks to Devotees at Alipiri

TTD Chairman Bhumana Karunakar Reddy starts giving Sticks to Devotees at Alipiri

ఇటీవల తిరుమల(Tirumala) నడక దారిలో చిరుత(Leopard) దాడి చేసి ఓ చిన్నారిని చంపేసింది. ఆ తర్వాత కూడా చిరుతలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నాయని తెలియడంతో, దాడి చేసిందని తెలియడంతో భక్తులు భయపడుతున్నారు. భక్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ భక్తులు(Devotees), ప్రతిపక్షాలు కోరారు.

అయితే ఈ విషయంలో టీటీడీ(TTD) నడక మార్గంలో వెళ్లే వారికి చేతి కర్రలు(Stics) ఇస్తామని ప్రకటించడంతో ఈ విషయంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కర్రని చూపిస్తే చిరుతలు పారిపోతాయా అని తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు ప్రజలు, నెటిజన్లు. దీనిపై ప్రతిపక్షాలు, పలువురు ప్రముఖులు కూడా విమర్శించారు. అయినా టీటీడీ దీనిపై వెనక్కి తగ్గకుండా కర్రల పని మొదలుపెట్టి రెడీ చేసేసింది.

నేటి నుంచే అలిపిరి వద్ద కాలి నడకన వెళ్తున్న భక్తులకు కర్రలు పంపిణీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నడకదారి భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసమే కర్రలు పంపిణీ చేస్తున్నాము. క్రూర మృగలతో పోరాడామని కాదు. చేతి కర్ర ఇచ్చి మా చేతులు దులుపుకోము. అడుగడుగునా సిబ్బంది పహారా ఉంటారు. విమర్శలు చేసే వారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. మేము మంచి ఆలోచనతో మొదలుపెట్టాము. పైకి వెళ్లాక మళ్ళీ కర్రలు వెనక్కి తీసుకుంటారు అని తెలిపారు. మరి ఈ కర్రల ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.