TTD : రేపు ఏప్రిల్ నెల రూ. 300 ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేయ‌నున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను రేపు ఉద‌యం

Published By: HashtagU Telugu Desk
Ttd Special Darshan Tickets

Ttd Special Darshan Tickets

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను రేపు ఉద‌యం ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ఈ కోటా టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరితగతిన టిక్కెట్లు పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సంబంధిత వివరాలను నమోదు చేయడం ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. కాగా మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వికలాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేసింది.

  Last Updated: 26 Mar 2023, 11:40 AM IST