AP-TS 2024 Election Schedule : ఏపీ – తెలంగాణ లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్‌ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
Ap Ts 2024

Ap Ts 2024

లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ కు సంబదించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలియజేసారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసారు. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్‌ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే..రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న లెక్కింపు చేపట్టనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ విషయానికి వస్తే.. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు షెడ్యూల్​ వెల్లడించింది. మే 13న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, జూన్‌ 4న లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. దేశ పౌరులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజీవ్ కుమార్ కోరారు. 2024లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాదిని ఎన్నికల నామసంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రపంచమంతా భారత్‌లోని ఎన్నికల వైపునకు చూస్తోందని అన్నారు.

Read Also : Lok Sabha Elections: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

  Last Updated: 16 Mar 2024, 04:25 PM IST