Truth Bomb : ‘ట్రూత్ బాంబ్’ తుస్సు ..ఏదన్న జగనన్న ..?

Truth Bomb : వైసీపీ ఎలాంటి ట్వీట్ చేస్తుందో..ఏ సంచలనం రేపుతుందో అని అంత ఎదురుచూసారు. కానీ వైసీపీ మాత్రం తుస్సు మంటూ నీరుకార్చింది

Published By: HashtagU Telugu Desk
Jagan Jagan Assembly Mmembership

Jagan Assembly Mmembership

నిన్న మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్ అదే..టీడీపీ, వైసీపీ పార్టీలు అక్టోబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో అని.. అధికార పార్టీ కూటమి (TDP), గత వైసీపీ ప్రభుత్వం (YCP) ఇద్దరు పోటాపోటీగా ట్వీట్స్ (Tweets) చేసారు. మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ ముందుగా టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ‘Truth Bomb Dropping’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇలా ఇరు పార్టీల పోస్టులకు అర్థం ఏంటి? ఏం చెప్పబోతున్నాయి? ఏంజరగబోతుంది..? అని టీడీపీ, వైసీపీ శ్రేణులే కాదు ప్రజలు సైతం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసారు.

అయితే చెప్పిన టైం కంటే ముందే టీడీపీ..వైస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి గొడవలు బయటపెట్టి సంచలనం రేపింది. జగన్ ..షర్మిల కు ఇచ్చిన హెచ్చరిక , దానికి షర్మిల ఇచ్చిన కౌంటర్లను టీడీపీ ప్రజల ముందు ఉంచి యావత్ తెలుగు ప్రజలు మాట్లాడుకునేలా చేసింది. అయితే వైసీపీ ఎలాంటి ట్వీట్ చేస్తుందో..ఏ సంచలనం రేపుతుందో అని అంత ఎదురుచూసారు. కానీ వైసీపీ మాత్రం తుస్సు మంటూ నీరుకార్చింది.
‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా (Drug mafia)ని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ కొన్ని పత్రాలను జత చేసింది. తాము ఇచ్చిన సమాచారం వంద శాతం కరెక్ట్ అని ధీమాగా చెప్పలేకపోయింది. చాలా వరకు వాటిని బ్లర్ చేసింది. అయితే క్లారిటీ లేకుండా బిగ్ రివీల్ అంటూ చెప్పడం దేనికంటూ సోషల్ మీడియాలో వైసీపీపై కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఈ దానికా..అంత బిల్డప్ అవసరమా..? అని సెటైర్లు వేయడం చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ఏదో చేద్దామని..ఏదో చేసి..చివరికి ఏది కాకుండా అయిపోయాడు.

Read Also :  Supreme court : గడియారం గుర్తు.. శరద్‌పవార్‌ పార్టీకి షాక్.. అజిత్ పవార్‌కు ఊరట..

  Last Updated: 24 Oct 2024, 06:44 PM IST