TDP Vs Kodali Nani : కాసినో..అభిమన్యుడు

మంత్రి కొడాలి వెంకటేశ్వరావు అలియాస్ నాని పదవి నుంచి వెళ్లే వరకు టీడీపీ వదలకుండా పోరాడాలని నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 04:17 PM IST

మంత్రి కొడాలి వెంకటేశ్వరావు అలియాస్ నాని పదవి నుంచి వెళ్లే వరకు టీడీపీ వదలకుండా పోరాడాలని నిర్ణయించింది. ఆ మేరకు గవర్నర్ బిశ్వాభూషన్ ను కల్సి గుడివాడ కాసినో పై ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ కు కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. చట్టవ్యతిరేకమైన కాసినో ఆడినప్పటికీ కేసులు పెట్టలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద కూడా కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రూల్ ఆఫ్ లా అమలు కావటం లేదని మరోసారి రాష్ట్రపతి కి ఏపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి టీడీపీ సిద్దం అవుతుంది.ఇంతటితో వదిలేయాలని రెండు రోజుల క్రితం ఒక టీవీలో కొడాలి కోరాడు. అంతే కాదు అక్కడ కాసినో..జరిగిందని పరోక్షంగా ఒప్పుకున్నాడు. అయితే , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆడించాడని మరో మెలిక తిప్పాడు. ఆయనకు, తనకు కామన్ ఫ్రెండ్స్ గుడివాడ కాసినో లో ఉన్నారని అంగీకరించాడు. ఈ ఇష్యూని ఇంతటితో వదిలి పెట్టాలి అని ఒక రకంగా వేడుకున్నాడు. టీడీపీ చేస్తున్న పోరాటానికి దాదాపుగా కొడాలి భాయపడ్డాడు. ఆ రోజు టీవీ లో ఆయన మాట్లాడిన మాటలు వింటే తలొగ్గాడు అనిపించింది. ఎప్పుడూ చంద్రబాబును అనుచితంగా మాట్లాడే ఆయన మీడియా సమావేశంలో చంద్రబాబు గారు అనడం చూస్తే బాగా ఇరుక్కున్నాడు అనే భావన కలుగుతుంది. బహుశా జగన్ నుంచి కూడా అనుకూల వాతావరణం లేదని నాని మాటల ద్వారా అర్థం అవుతుంది. పైగా వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరూ నాని కి మద్దతుగా రాలేదు. అంబటి, పేర్ని నాని, అనిలకుమార్, రోజా తదితరులు ఎవరూ వాయిస్ వినిపించ లేదు. ఒంటరి పోరాటం కొడాలి చేస్తున్నాడు అని వారం రోజులుగా అనేక వెబ్ సైట్ లు, పేపర్స్ లో న్యూస్ వస్తుంది. కానీ, ఇప్పటి వరకు ఎవరు నానికి మద్దతుగా వైసీపీ లీడర్లు నిలవలేదు. వచ్చే నెల 14 నుంచి అసెంబ్లీ జరగనుంది. ఆ రోజున టీడీపీ కాసినో అంశాన్ని సీరియస్ గా ప్రస్తావించడానికి రెడి అవుతుంది. అసెంబ్లీ వేదికగా తేల్చుకోవడానికి ఆధారాలతో సిద్దం కావాలని భావిస్తుంది. గతంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద ఎలా టీడీపీని వైసీపీ కార్నర్ చేసిందో. అలాగే ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేయడానికి టీడీపీ అన్ని రకాలుగా అస్త్రాలను సిద్దం చేస్తుంది. 14 న జరిగే అసెంబ్లీ నాటికి ఉద్యోగుల సమ్మె ఉంటుంది. ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మె కు దిగుతున్నారు. ఇంకో వైపు జిల్లాల సంఖ్య పెంపు మీద సీరియస్ చర్చ ఉంటుంది. ఆ రోజుకు మూడు రాజధానుల సమగ్ర బిల్లు కూడా సిద్ధం అవుతుంది. పై గా బడ్జెట్ సమావేశాలు సందర్భంగా ఇవన్నీ వస్తున్నాయి. వీటిని కాదని కొడాలి కాసినో మీద టీడీపీ అసెంబ్లీ వేదికగా పట్టు పడుతుందా? అంటే ఖచ్చితంగా అంటూ సమాధానం ఆ పార్టీ నుంచి వస్తుంది.

కాసినో ఇష్యూ ప్రజల్లోకి బాగా వెళ్లిందని టీడీపీ అంచనా. పైగా కోడాలిని బర్త్ రఫ్ చేయిస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుందని భావిస్తోంది. ఒక వేళ బర్త్ రఫ్ చేయక పోయినా త్యరలో జరిగే మంత్రివర్గంలో చోటులేకుండా చేయాలని టీడీపీ ప్లాన్. పైగా వైసీపీలో కూడా కొడాలి మీద కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తే ఆ స్థానం కోసం అదే జిల్లా నుంచి కొందరు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వైసీపీలోని సుబ్బారావు గుప్తా లాంటి వాళ్ళు కొడాలి మాటలు పార్టీకి నష్టమని బహిరంగ వేదికలపై చెప్తున్నారు. ఇటీవల పీకే చేసిన సర్వేలోనూ కొడాలి మాటలు వైసీపీకి నష్టం అనే భావం వచ్చిందట. దీంతో కొడాలిని నైస్ గా వదిలించు కోవడానికి జగన్ కు కలిసొచ్చిన అంశంగా కాసినో ఇష్యూ ఉందని తాడేపల్లి వర్గాల్లో ఉందట. 14న జరిగే అసెంబ్లీ సమావేశాల తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తుంది. అప్పుడు కొడాలిని తొలగిస్తే స్వామి కార్యం స్వకార్యం లాగా జగన్ అనుకున్నది. …సాఫీగా జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ అంతర్గత చర్చ. అన్నిటికీ తాను ఉన్నానంటూ మీడియా ముందుకు వచ్చే సజ్జల కూడా సైలెంట్ గా ఉన్నాడు. అంటే తాడేపల్లి ప్యాలెస్ కొడాలి ని నైస్ గా తొలగించుకునే ఎత్తుల్లో ఉందన్నమాట. ఇదే నిజం అయితే చంద్రబాబు రూపంలో జగన్ అనుకున్నది జరగబోతోందన్నమాట. సో..పద్మవుహంలో ఇరుక్కున్న అభిమాన్యుడిలా కాసినోలో కొడాలి చిక్కుకున్నాడు. బయట పడతాడా? పదవి పోగొట్టుకుంటాడా? చూద్దాం.