Site icon HashtagU Telugu

PK Trolling: పవన్ 8 కొత్త కార్లపై విపరీత ట్రోలింగ్!!

Pawan Kalyan

Pawan Kalyan

వచ్చే ఎన్నికలు లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం ఆయన కోటిన్నర రూపాయలతో 8 బ్లాక్ కలర్ కార్లను కొన్నారు. సీఎం, పీఎం కాన్వాయ్ లను తలపించేలా.. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ నల్ల కార్లతో ఇక హుందాగా కనిపించనుంది. దీనిపై జన సేనాని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతర పార్టీలపై సానుభూతి కలిగిన నెటిజన్స్ పవన్ కళ్యాణ్ 8 కార్లపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.

” పవన్ ను దత్త పుత్రుడిగా చూసే ఒక రాజకీయ నాయకుడు ఈ కార్లను కొనిచ్చాడేమో?!” అని ఒకరు కామెంట్ చేశారు. “ఈఎంఐ లు కట్టేందుకూ డబ్బులు లేవన్నావు.. మరి ఇంత పెట్టి పవన్ కార్లు మాత్రం ఎలా కొన్నారు ? సాధారణ కానిస్టేబుల్ కొడుకుకు ఇది సాధ్యమా?” అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “భవిష్యత్ లో సీఎం కాలేనని పవన్ గుర్తించి ఉంటారు. ఇలాగైనా ఆ కోరిక తీర్చుకుంటున్నారు. అందుకే 8 కార్లు కొన్నట్టుంది” అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. “కనీసం ఎమ్మెల్యే గా కూడా పవన్ గెలువలేకపోయారు. కార్లతో సినిమాల్లో స్టార్డం పెంచుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదు.రాజకీయాల సీరియస్ నెస్ ను గ్రహించలేక పవన్ కళ్యాణ్ జోకర్ గా మిగిలిపోయారు” అని మరో నెటిజన్ పేర్కొన్నారు.