Site icon HashtagU Telugu

AP : వైసీపీని చిత్తూ చేయాలంటూ త్రివిక్రమ్ పిలుపు

Trivikram Support Nda

Trivikram Support Nda

ఏపీ(AP)లో పోలింగ్ (Poling) కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమికి మద్దతు విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా చిత్రసీమ (Tollywood) నుండి ఎవరు ఊహించని విధంగా ఈసారి మద్దతు వస్తుండడంతో కూటమి నేతల్లో గెలుపు ఫై మరింత ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇండస్ట్రీ సైలెంట్ గా ఉండేసరికి..ఈసారి కూడా సైలెంట్ గానే ఉంటుందని..చేస్తే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతారు అంతే అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కు మీమున్నాం అంటూ ప్రతి ఒక్కరు మద్దతు తెలుపడం వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. జబర్దస్త్ టీమ్ దగ్గరి నుండి మొదలుపెడితే అగ్ర నిర్మాతలు , హీరోలు , దర్శకులు , సైడ్ ఆర్టిస్టులు , జూ. ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు అలాగే కూటమి కి జై కొడుతూ వస్తున్నారు. కొంతమంది నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా..మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మాటల మాంత్రికుడు , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ (Trivikram) సైతం వైసీపీ ని చిత్తూ చేయాలనీ పిలుపునిచ్చారు. ఏపీ పాలిట ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి, కూటమిని గెలిపించాలన్నారు. దీనికి ముందు పలు పరిణామాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్… ఆ అభిమానంతో పవన్ మద్దతుగా ఓ పాట రాశారు. టాలీవుడ్ లో ఎవరైనా వైసీపీకి అనుకూలంగానే పాటలు రాయాలి.. తమకే ప్రచారం చేయాలనే విధంగా వింత పోకడలు పోతున్న వైసీపీ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ ను టార్గెట్ చేసింది.

సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పేరు, పర్సనల్ ఫోన్ నెంబర్ పెట్టడంతో ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 5వేల కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. త్రివిక్రమ్ కు ఫోన్ చేసి, తిట్లు, శాపనార్థాలు పెట్టారట. అందుకే ఆయన వైసీపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు. తెలుగు సినీ పరిశ్రమను వైసీపీ చేజేతులా ప్రత్యర్థిగా మార్చుకుంటోందని సినీ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో త్రివిక్రమ్ పాట రాసినందుకు అతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా జగన్..చిత్రసీమ ఫై కావాలనే ఇబ్బందులకు గురి చేసాడని..చిత్రసీమ ఎక్కువగా టీడీపీ కి సపోర్ట్ గా ఉంటుందని..అందుకే తన హయాంలో చిత్రసీమ కు ఎప్పుడు లేని ఇబ్బందులకు గురి చేసాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకోవడం , టికెట్ రేట్లు తగ్గించడం ఇవన్నీ కూడా చిత్రసీమ ప్రముఖుల్లో ఆగ్రహం తెప్పించాయి. అందుకే వారంతా టైం చూసి జగన్ ఫై కసి తీర్చుకుంటున్నారు.

Read Also : Chiranjeevi : మే 10న చంద్రబాబును చిరంజీవి కలవనున్నారా?

Exit mobile version