Muddy Water : అల్లూరి జిల్లాలో దారుణం : త్రాగు నీరు లేక బురద నీరు తాగుతున్న గిరిజనులు

అల్లూరి జిల్లా ముంచింగ్ పుట్టు మండలం కొడగడు గ్రామంలో గిరిజనులు త్రాగునీరు లేక బురద నీరు

  • Written By:
  • Publish Date - July 23, 2023 / 06:01 PM IST

అల్లూరి జిల్లా ముంచింగ్ పుట్టు మండలం కొడగడు గ్రామంలో గిరిజనులు (Tribals ) త్రాగునీరు లేక బురద నీరు (Drinking Muddy Water) తాగుతున్న ఘటన అందర్నీ కలచివేస్తుంది. రాష్ట్రంలో చాల గ్రామాల్లో త్రాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇప్పుడు వర్షాలు పడుతుండడం తో కొండప్రాంతాల్లో ఉండే గిరిజనులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అల్లూరి జిల్లా (Alluri District)ముంచింగ్ పుట్టు మండలం కొడగడు గ్రామంలో గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న తమను పట్టించుకునే నాధుడు లేరని , కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని వారంతా వాపోతున్నారు.

ఈ ప్రాంతంలో ముందు నుండి కూడా త్రాగు నీరు సమస్య ఉంది. త్రాగు నీరు కోసం బిందెలతో మైళ్ల దూరం నడిచి తెచ్చుకుంటారు. ఇక ఇప్పుడు వర్షాకాలం మొదలుకావడం..గత నాల్గు రోజులుగా జిల్లాలో విపరీతమైన వర్షాలు పడుతుండడం తో ఇక్కడి వారికీ త్రాగు నీరు మరింత సమస్య గా మారింది. ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గిరిజనులు బురద నీరునే తాగుతున్నారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అసలే వర్షాకాలం..తాగే నీటి విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెపుతుంటారు. అలాంటిది ఈ గిరిజనులు తాగేందుకు మంచి నీరు లేక ఈ బురద నీటినే తాగుతున్నారు. దీంతో వారు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులకు తమ సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కొడగడు గ్రామస్తులు చేతులెత్తి మొక్కుతున్నారు.

Read Also : Rain Alert: రానున్న మూడు రోజుల్లో ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు