Andhra Pradesh: రోడ్డు సదుపాయం లేక దారిలోనే ప్రసవించిన గిరిజన మహిళ

గిరిజన ప్రాంత వాసుల్ని ప్రభుత్వలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళని కేవలం ఓటు కోసమే వాడుకుంటున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి.

Andhra Pradesh: గిరిజన ప్రాంత వాసుల్ని ప్రభుత్వలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళని కేవలం ఓటు కోసమే వాడుకుంటున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి. ఈ క్రమంలో చిన్న వైద్య సదుపాయం వారికీ అందాలంటే కాళ్లు కాయలైపోవాలంతే. తాజాగా ఏపీలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు సదుపాయం లేక ఓ గిరిజన మహిళ దారిలోనే ప్రసవించింది. ఈ ఘటనతో సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ పరిధిలోని చీడివలస గిరిజన తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీడివలసకు చెందిన 28 ఏళ్ల మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. అంబులెన్స్ సహాయం కోసం కుటుంబ సభ్యులు కాల్ చేసినప్పటికీ, రోడ్డు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో అంబులెన్స్ ఆ గ్రామానికి చేరుకోలేకపోయింది. ప్రసవ నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళ రోడ్డు పక్కనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను తదుపరి సంరక్షణ నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

We’re now on WhatsAppClick to Join

ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో రోడ్ల దుస్థితి అత్యంత దారుణంగా తయారైంది.పట్టణ ప్రాంతాల్లో సంగతి పక్కన పెడితే మారుమూల గ్రామాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు, ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఏజెన్సీలోని ఎన్నో గిరిజన గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు లేని పరిస్థితి. గిరిజనులకు ఆరోగ్యం బాగోలేకపోయినా , గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నా డోలి కట్టి కిందకి తీసుకువచ్చే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Also Read:Pawan Kalyan : పిఠాపురం కొత్త ఇంటిలో.. పవన్ ఉగాది సెలబ్రేషన్స్ చూశారా..!