Agency Problems : ఏజెన్సీల్లో డోలీ క‌ష్టాలు..తీర్చే నాథుడే లేడా…?

ఏపీలోని గిరిజ‌న గ్రామాల్లో మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స‌రైన ర‌హ‌దారి సౌక‌ర్యం లేక ఆసుప‌త్రికి వెళ్లాలంటే న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు.

  • Written By:
  • Updated On - December 4, 2021 / 04:01 PM IST

ఏపీలోని గిరిజ‌న గ్రామాల్లో మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స‌రైన ర‌హ‌దారి సౌక‌ర్యం లేక ఆసుప‌త్రికి వెళ్లాలంటే న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. గ‌ర్భిణీ స్త్రీలు ఆసుప‌త్రికి వెళ్లాలంటే డోలీలే దిక్క‌వుతున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం గిరిజ‌న‌ల అభివృద్ధి కోసం అనుక సంక్షేమ ప‌థ‌కాలు పెట్టినప్ప‌టికీ ఎక్క‌డా అవి ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేదు. పాల‌కులు గిరిజ‌న‌ల‌పై మాట‌ల‌తో ప్రేమ చూపిస్తున్నారు త‌ప్ప వారి బ్ర‌తుకులు మార్చే విధంగా మాత్రం ఆలోచ‌న చేయ‌డం లేదు. క్షేత్ర స్థాయిలో గిరిజనుల గోడు వినే నాధుడే క‌రువైయ్యాడు. గిరిజ‌నుల‌ను కేవ‌లం ఓటు బ్యాంక్ గా మాత్ర‌మే నాయ‌కులు చూస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎప్పుడూ రాని నాయ‌కులు త‌మ ప్రాంతాల‌కు వ‌చ్చి క‌ళ్ల‌బొల్లి మాట‌లు చెప్పి వెళ్తున్నారు. అదే స‌మ‌యంలో వారి క‌ష్టాల‌ను నాయ‌కులకు చెప్పుకుంటూ గిరిజ‌నులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఏజెన్సీలో అడుగడుగున అసౌకర్యాలతో, ఇబ్బందులతో పడరాని పాట్లు పడుతున్న గిరిజనులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు

Agency Problems2

ఏపీలో విశాఖప‌ట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు అర‌కొర‌క సౌక‌ర్యాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గర్భిణీ మహిళలు ఆసుపత్రులకు వెళ్లడానికి ప్రసవవేదన కు మించిన బాధలను అనుభవిస్తున్నారు. సాధార‌ణంగా గిరిజ‌న ప‌ల్లెల్లో ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు ఎక్క‌డా లేవు…వీరికి ఏ చిన్న జ్వ‌రం వ‌చ్చి కిలోమీట‌ర్ల మేర న‌డిచి వెళ్లాల్సిందే. కనీసం వాహనాలు కూడా వెళ్లేందుకు రోడ్లు లేకపోవడం తో గర్భిణీ మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సిందే. నొప్పులతో బాధపడుతున్న మహిళలను డోలీలు క‌ట్టుకుని మోసుకుంటూ ఆసుపత్రికి తరలించాల్సి న పరిస్థితి నేటికీ కనిపిస్తుంది.

స్వ‌తంత్ర భార‌తంలో కూడా నేటీ డోలీలు క‌ట్టి ఆసుప‌త్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉండ‌టం సిగ్గుచేటు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామని చెబుతున్నా, గిరిజన ప్రాంతాలలోని పరిస్థితులు, గర్భిణీ మహిళలను డోలి కట్టి ఆసుపత్రికి తీసుకు వెళుతున్న సంఘటనలు మన ప్రగతిని వెక్కిరిస్తూ…పాలకుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం బలపం పంచాయతీ మారుమూల గ్రామమైన తోకపాడులో కుసంగి చంద్రమ్మ అనే నిండు గర్భిణీకినొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికితరలించారు.అయితే రోడ్డు మార్గం కూడా లేకపోవడంతోడోలీకట్టి,డోలీలో గర్భిణీ మహిళనుపడుకోబెట్టి20 కిలోమీటర్ల మేరమోస్తూ నడుచుకుంటూ ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రసవ వేదనను మించిన నరకయాతన ఆ గర్భిణీ మహిళ అనుభవించింది. దాదాపు ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి 20 గంటలకు పైగా పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.