Group 1 Question Paper : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఈ ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్న పత్రంలో ప్రశ్నలు అడిగిన తీరును చూసి అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ట్రాన్స్ లేషన్, అక్షర, అన్వయ దోషాలు క్వశ్చన్ పేపర్‌లో ఎక్కువగా కనిపించాయి. ప్రశ్నలను ఇంగ్లిష్ నుంచి తెలుగులోనికి అనువదించడంలో చాలా తప్పులు జరిగాయని అభ్యర్థులు గుర్తించారు. దీంతో ప్రశ్నలను ట్రాన్స్ లేట్ చేయడానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ వాడారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసిన ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి తెలుగు అభ్యర్థులు చాలా ఇబ్బందిపడ్డారు. దీంతో వారి సమయం వేస్ట్ అయింది. 63 పేజీలతో ఉన్న పేపర్-1 ప్రశ్నపత్రంలో చాలా తప్పులను చూశామని అభ్యర్థులు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
అనువాదంలో తప్పులు ఇవీ..
- హిస్టరీ విభాగం(B – Series) 22వ ప్రశ్నలో ఇంగ్లిష్ నుంచి తెలుగులోనికి అతివాద దశ అని పేర్కొనడానికి బదులు తీవ్రవాద దశగా అనువాదం చేశారు.
- పేపర్-2లో సైన్స్ అండ్ అండ్ టెక్నాలజీ విభాగం (C – Series) 66వ ప్రశ్నలో శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించి కొత్త(నావెల్) పరికరం ద్వారా నిర్థారణ పరీక్షలు అన్న ప్రశ్న తెలుగు అనువాదంలో నవల అని ముద్రించారు.
- పేపర్-2లో 109వ ప్రశ్నలో ‘కోస్ట్ గార్డ్ సైనిక విన్యాసాలు’ అని కాకుండా ‘కోస్ట్ గార్డ్ వ్యాయామం’ అని ముద్రించారు.
- ఇక జైన మతరచనల గురించి అడిగిన ప్రశ్నలో ప్రాకృతంకు బదులుగా కృతాన్ని, జైనులు అనే పదానికి ప్రాజైనులు అని ముద్రణ అయింది.
Also Read :TB Symptoms: సైలెంట్ గా వచ్చి ప్రాణాలు తీస్తున్న క్షయ (TB)
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1(Group 1 Question Paper) పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష జరిగింది. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,26,068 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 శాతం) మంది , పేపర్-2 పరీక్షకు 90,777 మంది హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన వారినే మెయిన్స్ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్ పరీక్షకు 1: 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.