IAS Officers : ఏపిలో 19 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే..

Published By: HashtagU Telugu Desk
Relieves AP Cadre IAS Officers

Relieves AP Cadre IAS Officers

IAS Officers Transfer: ఏపిలో 19 మంది ఐఏఎస్‌లను, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ (State Govt)ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌(Nirabh Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శిగా సురేశ్ కుమార్‌లను బదిలీ చేశారు. సురేశ్ కుమార్‌కు గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా కూడా సురేశ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా హర్షవర్ధన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యదర్శిగా పి.భాస్కర్‌లను బదిలీ చేశారు. పి.భాస్కర్‌కు ఈడబ్ల్యుఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించారు.

సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా కె.కన్నబాబును బదిలీ చేశారు. ఆయనకు గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గాను బాధ్యతలు అప్పగించారు. వినయ్ చంద్‌ను పర్యాటక శాఖ కార్యదర్శిగా, వివేక్ యాదవ్‌ను యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా, సూర్యకుమారిని మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా, సి.శ్రీధర్‌ను ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

Read Also: BRS : మరో వికెట్ అవుట్..రేపు కాంగ్రెస్ లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

జె.నివాస్‌కు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా, విజయరామరాజుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా, ఢిల్లీరావుకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. హిమాంశు శుక్లాకు సమాచార, పౌరసంబంధాల శాఖ బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్‌ను బదిలీ చేశారు. గిరిజా శంకర్‌ను ఆర్థిక శాఖ నుంచి రిలీవ్ చేశారు.

అంతేకాక, రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల(IPS officers)ను ప్రభుత్వం బదిలీ చేసింది. హోం సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తాను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్, జీఏడీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఇక కుమార్ విశ్వజిత్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ చేసింది.

Read Also: Kalki : కల్కి ఆఫ్ స్క్రీన్ ప్రభాస్ స్టిల్.. రెబల్ ఫ్యాన్స్ ఖుషి..!

  Last Updated: 11 Jul 2024, 07:43 PM IST