Site icon HashtagU Telugu

Trans woman Gang Raped: హిజ్రాపై గ్యాంగ్ రేప్!

Singapore

Crime

ఓ హిజ్రాపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని పులివెందుల పట్టణంలోని కదిరి రింగ్‌రోడ్‌లోని ఓ దేవాలయం సమీపంలో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. హిజ్రాపై  13 మంది గ్యాంగ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ లోని ఎనిమిది మందిని అరెస్టు చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్నారెడ్డి బాల గంగి రెడ్డి, పి జయ చంద్ర, మల్లు హరికృష్ణ, ఎస్ సుబ్రమణ్యం, చలపతి, పి గురుప్రసాద్, చక్రి, కె ధన్యవ్ కుమార్ (20 నుండి 51 సంవత్సరాల) మధ్య వయస్సున్నవారిని అరెస్టు చేశారు.

డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంతపురం నుంచి గ్యాంగ్ తిరిగి వస్తుండగా రింగురోడ్డుపై ఇద్దరు ట్రాన్స్‌ మహిళలను భిక్షాటన చేయడాన్ని గమనించారని, నిందితులు వారిలో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు వెంటనే స్పందించలేదని, దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాతే చర్యలు తీసుకున్నారని ట్రాన్స్ మహిళలు ఆరోపించారు. రేప్ కు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని హిజ్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.