గత కొద్దీ నెలలుగా ప్రయాణికులకు వరుస షాకులు ఇస్తుంది దక్షిణ మధ్య రైల్వే. ఆధునికీకరణ పేరుతో వరుసగా రైళ్లను రద్దు చేస్తుండడం తో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ట్రైన్ నడుస్తుందో..ఏ ట్రైన్ నడవదు అర్ధం కావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మొన్నటి వరకు వరంగల్ – విజయవాడ రూట్లలో పలు రైళ్ల సర్వీస్ లను రద్దు చేయగా..ఇప్పుడు విజయవాడ డివిజన్ పరిధిలో దాదాపు 47 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గత కొద్దీ రోజులుగా తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ వచ్చారు. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బందులు పడలేదు. అయితే కీలకమైన ఈ రైళ్లను 47రోజులపాటు రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
వైజాగ్ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో ఎక్కువ మంది జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లలోనే ఎక్కుతారు. దీనికి కారణం వీటి ఛార్జీలు తక్కువగా ఉండడమే. ఒక్కో రైలులో రోజుకు 2 వేల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేసినా, మూడు రైళ్లను కలిపి సుమారు 6 వేల మందిని ప్రయాణిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో సైతం ఇదే స్థాయిలో జనాలు ఆయా రైళ్లను ఆశ్రయిస్తారు. ఈ లెక్కన రోజుకు 12 వేల మంది ఆయా రైళ్లపై ఆధాపడుతున్నారు. అంతటి కీలకమైన రైళ్లను ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఏకంగా 47 రోజులపాటు రద్దు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. కనీసం మూడింటిలో ఒక్క ట్రైన్ అయినా నడపాలంటూ పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని వాపోతున్నారు. మరి దక్షిణ మధ్య రైల్వే ఏంచేస్తుందో చూడాలి.
Read Also : PM Modi : ‘ఎమర్జెన్సీ’ మళ్లీ రావొద్దంటే విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి : ప్రధాని మోడీ