గత కొద్దీ నెలలుగా వరుసగా రైలు ప్రమాదాలు (Train Accidents) జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రైలు (Trian) ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. తాజాగా ఏపీలో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది. దీనిని గ్యాంగ్ మేన్ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
విరిగిన పట్టాను గమనించి.. దీనిపై అధికారులకు సమాచారం అందించడం తో అధికారులు రామేశ్వరం నుంచి వస్తున్న రైలును నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మరమ్మతులు చేసి యథావిథిగా రైళ్లను నడిపారు. రైలు పట్టా మరమ్మతుల కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా పాకాలకు చేరుకుంది రైలు.. ప్రస్తుతానికి ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read Also : Minister Harish Rao : నా వల్ల రైతుబంధు ఆగలేదు – హరీష్ రావు