Falaknuma Express: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బెంగాల్‌లోని హౌరా వైపు వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా పలాస శివార్లకు చేరుకోగానే, రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read :Kia Car Engines: కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజిన్లు మాయం.. ఏమయ్యాయి ?
కారణం ఇదీ..
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది. ఇందువల్లే రైలు రెండు భాగాలుగా విడిపోయిందని రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది, విడిపోయిన బోగీలను రైలుకు అమర్చారు. ఇవాళ ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనపై రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. ఎందుకిలా జరిగిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం ఉందా ? విద్రోహ చర్య ఉందా ? అనేది తెలుసుకునే దిశగా విచారణ జరుగుతోంది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు.
Also Read :HCL Tech Jobs: ఇంటర్ పాసైతే చాలు.. భారీ శాలరీతో హెచ్‌సీఎల్ టెక్‌లో జాబ్
చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు మే 31 వరకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో.. తిరుపతి నుంచి చర్లపల్లికి శనివారం, సోమవారం ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి మొత్తం 16 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఏప్రిల్ 13, 18, 20, 25, 27 తేదీల్లో, మే 2, 4, 9, 11, 16,18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 9: 35 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. ఏప్రిల్ 14, 19, 21, 26, 28 తేదీల్లో, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07018 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7: 10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఊందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.