చాలామంది రైలు ప్రయాణం (Train Journey) అంటే ఇష్టపడుతుంటారు..ముఖ్యంగా కిటికీల (Train Window Seats) పక్కన కూర్చుని..పకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనీ కోరుకుంటారు. ఇంకొంతమందైతే ట్రైన్ పూట్బోర్డు వద్ద కుర్చీవాలని భావిస్తారు..అయితే ఇలాంటి వారికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కిటికీల వద్ద కుర్చీని ఫోన్ మాట్లాడడం కానీ , సాంగ్స్ వినడం వంటివి చేయకూడదని..ఎందుకంటే దొంగలు ఇటీవల ఇలాంటి వారిని టార్గెట్ చేసుకొని ఫోన్లు , జేబులో డబ్బులు , నగలు లాగేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. మాట్లాడే బిజీ లో ఉండడం, పాటలు వింటూ ఉండడం చేస్తుండడం..కదులుతున్న ట్రైన్ నుండి దొంగలు ఫోన్లు లాగడం , డబ్బులు దోచుకోవడం చేస్తున్నారని చెపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గత రెండేళ్లుగా ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన డి శ్రీను, ప్రకాశం జిల్లాకు చెందిన వి పవన్‌కుమార్ చెడు వ్యసనాలకు అలవాటయ్యారు. రెండేళ్లుగా తుని, సామర్లకోట స్టేషన్ల దగ్గర ఉంటూ దొంగతనాలు చేసేవారు. రైళ్లు కదిలేలోపు మొబైల్స్, డబ్బుల్ని దోచేసేవారు. ఆదివారం తుని స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తాము చేసిన నేరాలను ఒప్పుకొన్నారు. ఈమేరకు వారి నుంచి రూ.2 లక్షల డబ్బులు, రూ.1.33 లక్షల విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ముఖ్యంగా కిటికీల వద్ద కూర్చున్నప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Also : Ashok Chavan: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి అశోక్ చవాన్.. కమల్‌నాథ్ కూడా.. ?