Rains : వరద సహాయక చర్యల్లో విషాదం.. లైఫ్ జాకెట్ తెగి కానిస్టేబుల్ మృతి!

గతకొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా జన జీవనం పూర్తిగా స్తంబించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.

Published By: HashtagU Telugu Desk

గతకొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా జన జీవనం పూర్తిగా స్తంబించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరదల్లో చిక్కుకొని పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. మరికొంతమంది గల్లంతయ్యారు. భారీ ప్రాణ నష్టం జరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టింది. ఆర్డీఎఫ్, పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరద సహాయక చర్యలకు వెళ్లినా ఓ కానిస్టేబుల్ తిరిగి రాని లోకానికి వెళ్లారు.

విజయనగరం జిల్లా జిల్లా ఐదో బెటాలియన్‌కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కెల్లా శ్రీనివాసులు.. నెల్లూరు జిల్లాలో వరద బాధితులను కాపాడేందుకు వచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు వద్ద ఆయన సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే శ్రీనివాసులు వేసుకున్న లైఫ్ జాకెట్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వరద ప్రవాహానికి ఆయన కొట్టుకుపోయారు. ఊపిరి ఆడక నీటిలో కానిస్టేబుల్ తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. తమతో పాటే బాధితులను రక్షించేందుకు వచ్చిన శ్రీనివాసులు.. అకస్మికంగా వరద నీటిలో మృతి చెందడం పట్ల తోటి సిబ్బంది కంటతడి పెట్టారు.

 

  Last Updated: 21 Nov 2021, 03:10 PM IST