Sankranti Dishes Dearer : సంక్రాంతి పండుగ అంటేనే పిండివంటలకు పెట్టింది పేరు. వంట నూనెలు, పప్పులు, అన్ని రకాల పిండిల ధరలు మండిపోతుండటంతో పిండివంటలు మరింత ప్రియం అయ్యాయి. ఇళ్లలో వాటి తయారీ చాలావరకు తగ్గిపోయింది. ఎంతోమంది రెడీమేడ్‌గా పిండివంటలు కొని తెచ్చుకుంటున్నారు. ఫలితంగా వాటిని తయారు చేసి విక్రయించే వారికి మంచి గిరాకీ ఉంది. ఈవిధంగా సంక్రాంతి పండుగ వేళ ఎంతోమంది తయారీదారులకు ఉపాధి లభిస్తోంది. అంతమాత్రాన మనం ధరల మంట అంశాన్ని చిన్నగా చూడలేం.
Also Read :Swami Vivekananda Speech : చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగానికి హైదరాబాద్‌తో లింక్.. ఏమిటి ?
వీటి ధరలు చూడండి..
- సకినాలు, గారెల తయారీలో నువ్వులు, వాము వాడుతుంటారు. వంద గ్రాముల వాము ధర రూ. 40 దాకా ఉంది.
- నూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచింది. దీంతో పామాయిల్ లీటర్ ధర ఒక్కసారిగా రూ.94 నుంచి రూ.129కి చేరింది.
- సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటరుకు రూ.145 నుంచి రూ.150కి చేరింది.
- పల్లీ నూనె ధర లీటరుకు రూ.160కి చేరింది.
- రైస్ బ్రాన్ ఆయిల్ ధర లీటరుకు రూ.147 నుంచి రూ.160కి చేరింది.
- కిలోకు.. శనగపప్పు ధర రూ.100, నువ్వులు రూ. 170, బెల్లం రూ.70, గోధుమ పిండి రూ. 60 దాకా ఉంది.
- కిలోకు.. కందిపప్పు ధర రూ.158, మినప గుండ్లు రూ. 164, పెసరపప్పు రూ. 120 దాకా పలుకుతున్నాయి.
Also Read :Rs 70 Lakhs Bitcoins Looted : కొత్తకోటలో బిట్ కాయిన్ ట్రేడర్‌కు కుచ్చుటోపీ.. రూ.70 లక్షల కాయిన్స్ లూటీ
- కొత్త బియ్యం ధర రూ. 60, పాతబియ్యం ధర రూ.70కిపైనే ఉంది.
- గత వర్షకాలం సీజన్‌లో పండిన నాణ్యమైన బియ్యం ధర మాత్రమే కిలో రూ. 60లోపు ఉంది.
- జైశ్రీరాం, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ వంటి సన్నబియ్యం ధర పాతవైతే కిలో రూ.70 దాకా ఉన్నాయి.
- వెల్లుల్లి ధర కిలోకు రూ. 450 నుంచి రూ. 500 దాకా ఉంది.
- హైదరాబాద్‌లో కిలో ఉల్లిగడ్డల ధర రూ. 50 కంటే ఎక్కువే ఉంది.
- సంక్రాంతి పండుగ(Sankranti Dishes Dearer) తర్వాత ఈ ధరలు కనీసం 5 శాతం మేర తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.