Site icon HashtagU Telugu

CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్‌క్లేవ్‌ ప్రారంభం

Tourism Conclave begins in Vijayawada

Tourism Conclave begins in Vijayawada

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపింది. ఈ రంగాన్ని దేశ స్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయ‌న‌తో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి పర్యాటక అభివృద్ధికి పరిచే క్యారవాన్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇది పర్యాటక రంగానికి కొత్త గమనదిశను సూచిస్తున్నట్టు మంత్రివర్గ వర్గాలు తెలిపాయి.

Read Also: Shaving: ప్ర‌తిరోజూ షేవింగ్ చేస్తే జుట్టు మందం అవుతుందా?

పర్యాటకాన్ని పరిశ్రమగా గుర్తిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించింది. దీని ద్వారా పారిశ్రామిక రంగానికి వర్తించే అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇప్పుడు పర్యాటక రంగంపైనా వర్తించనున్నాయి. ఇందుకు సంబంధించి విధాన పత్రాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ కాన్‌క్లేవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) సుమారు రూ. 10,039 కోట్ల పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పెద్ద హోటళ్ల నిర్మాణానికి, ఎకో టూరిజం ప్రాజెక్టులకు, కేలింన్ క్యాంప్‌లు, బీచ్ రిసార్ట్‌లకు సంబంధించిన ఒప్పందాలు ఇందులో భాగంగా ఉన్నాయి.ఇవి పూర్తవడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెంది, యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఈ పెట్టుబడులతో పర్యాటక హబ్‌గా ఏపీ ఎదగనుందన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేశారు.కాంక్లేవ్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పర్యాటక రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టిని చాటుతోంది. దీనిపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ, ఏపీలో పెట్టుబడి వాతావరణం ఎంతో ఆకర్షణీయంగా మారిందని అభిప్రాయపడ్డాయి. ఈ ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం త్వరలో దేశంలో, అంతర్జాతీయ స్థాయిలోను తమ ముద్రవేసే అవకాశం ఉందని పరిశ్రమలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Tata Group: విమాన ప్రమాద బాధితులకు రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్