కర్నూలు, నంద్యాల జిల్లాల్లో టమాటా ధరలు (Tomato ) ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.4 నుంచి రూ.6 వరకు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట కోసేందుకు కూలీలకు చెల్లించే డబ్బు, రవాణా ఖర్చులు కలిపి వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు తమ పొలాల్లోనే పంటను వదిలేయాల్సి వస్తోంది. కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రాకపోవడం రైతులను నిరాశలోకి నెట్టింది.
Pothula Sunitha : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత
ధరల పతనానికి ప్రధాన కారణాలు మార్కెట్‌లో సరకు అధికంగా చేరడం, రవాణా సమస్యలు, ఎగుమతుల లోపం అని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా టమాటా పంట పెద్ద ఎత్తున రావడంతో డిమాండ్ కంటే సప్లై ఎక్కువైంది. రవాణా ఖర్చులు పెరిగిన కారణంగా తక్కువ ధరలకు కూడా కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. పైగా ఎగుమతులకు ప్రోత్సాహం లేకపోవడంతో దేశీయ మార్కెట్లలోనే సరకు పేరుకుపోయింది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు అండగా నిలవాలి. టమాటాకు కనీస మద్దతు ధర నిర్ణయించడం, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతుల మనోధైర్యం దెబ్బతిని, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అన్నదాతలను రక్షించడానికి తక్షణ చర్యలు అత్యవసరం.