Site icon HashtagU Telugu

Tomato Is The New Petrol: టమాటా Vs పెట్రోల్

పెట్రోల్ ధరలు, టమాటా ధరలు పోటీపడుతున్నట్టు కన్పిస్తున్నాయి.
లీటరు పెట్రోలు ధర 108 రూపాయలుండగా, కిలో టమాటా ధర కూడా సెంచరీ దాటేసింది.

హోటల్లో కాదుకదా, ఇంట్లో కూరల్లో కూడా టమాటా కన్పించట్లేదు.
రెస్టారెంట్స్ లో, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీల్లో కూడా టమాటా రెసెపీలకి అదనంగా బిల్లులు వేస్తున్నారు. ఏపీలో కిలో టమాట 130 రూపాయలకి చేరింది.

రెండు నెలల క్రితం వరకు కిలో టమాట కేవలం పది రూపాయలకు మించలేదు. ఒక్కసారిగా పదిరెట్ల ధర పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, తుఫానులతో టమాటా పంట పాడవడం, ఉన్న టమాటాలను కూడా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకురావడం ఈ వర్షాల వల్ల ఇబ్బంది అవుతోంది. అందుకే ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.