Actor Nikhil Join in TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్

హీరో నిఖిల్ సిధార్థ ఈ రోజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిఖిల్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది

Published By: HashtagU Telugu Desk
Actor Nikhil

Actor Nikhil

Actor Nikhil Join in TDP: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య వాతావరణం హాట్ హాట్ గా సాగుతుంది. ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తుండగా, జగన్ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగుతున్నాడు. ప్రజాగళం పేరుతో బాబు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాడు. అటు జగన్ బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి దూసుకెళ్తున్నాడు. ఇలా రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా సాగుతున్న వేళ ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిధార్థ ఈ రోజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిఖిల్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. టీడీపీ చీరాల అభ్యర్థి కొండయ్యకు నిఖిల్ అల్లుడు అవుతాడు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsAppClick to Join.

హ్యాపీడేస్ సినిమాతో హీరోగా తొలి సక్సెస్ కొట్టిన నిఖిల్ యువత, స్వామిరారా, కార్తి కేయ సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

Also Read: CM Revanth Reddy: నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  Last Updated: 29 Mar 2024, 10:44 PM IST