Site icon HashtagU Telugu

Ananthapuram : తొలకరి జల్లు..ఆ రైతును లక్షాధికారిని చేసింది

Tolakari Jallu..made That F

Tolakari Jallu..made That F

తొలకరి జల్లు పడితే రైతులంతా నాగలి పట్టుకొని పొలం పనులు మొదలుపెడతారు..కానీ రాయలసీమ లో మాత్రం తొలకరి జల్లు పడితే..వజ్రాల వేటలో నిమగ్నం అవుతారు. ఇది ఈరోజుది కాదు..ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న వేటే. కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు తొలకరి జల్లు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. గతంలోనూ ఇలా దొరికిన సందర్భాలు కోకొల్లలు. రెండు రోజులుగా తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాల సమయంలో వజ్రాలు దొరుకుతాయి. దీంతో ప్రతి ఏటా ఇక్కడ వజ్రాల కోసం స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటారు. తాజాగా, కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో మరో వజ్రం దొరికింది. పత్తికొండ నియోజకవర్గం మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. పెరవలికి చెందిన వ్యాపారి రూ. 20 లక్షలు పెట్టి వజ్రాన్ని కొనుగోలు చేశారు. అయితే బయట మార్కెట్లో ఆ వజ్రం విలువ చాలా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా వజ్రాల కోసం అనంతపురం జిల్లాలో కూడా వేట కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు, ఊటకల్లు, బేతపల్లి , బసినేపల్లి తదితర ప్రాంతాలలో వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. ఇక వజ్రాల వ్యాపారులు కూడా ఈ సీజన్లో ఈ జిల్లాల బాట పడతారు. గుట్టుచప్పుడు కాకుండా స్థానికులకు దొరికిన వజ్రాలను కొనుగోలు చేస్తారు.

Read Also : Varun Tej : ‘ఫిదా’ కాంబో మళ్ళీ సెట్ కాబోతుందా..?