ACB Court Verdict : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఈరోజు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పును వినిపించనుంది. అయితే ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి ఇవాళ లేదా సోమవారం ఇచ్చే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై బుధవారమే వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మరిన్ని విషయాలను బయటికి తెచ్చేందుకుగానూ టీడీపీ చీఫ్ ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది.
Also read :Check Petrol Rates: హైదరాబాద్ లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
రాజకీయ కక్ష పూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును తొలుత గురువారం ఉదయానికి వాయిదా వేశారు. అనంతరం దాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చారు. అయితే సాయంత్రం కూడా తీర్పును వెలువరించలేదు. శుక్రవారం ఉదయం తీర్పు చెబుతామని జడ్జి తెలిపారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు హైకోర్టులో పెండింగులో ఉన్నందున.. కస్టడీ పిటిషన్ పై తీర్పును న్యాయమూర్తి వాయిదా వేశారు. హైకోర్టులో శుక్రవారం క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పును మళ్లీ వాయిదా వేసే ఛాన్స్ ఉందని లీగల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించే అవకాశం (ACB Court Verdict) ఉందని చెబుతున్నారు.