Nara Chandrababu : జయహో చంద్రబాబు.. 75వ బర్త్‌డే వేళ జీవన విజయ విశేషాలివీ

1980-1983 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్ననీటి పారుదల తదితర శాఖలకు మంత్రిగా చంద్రబాబు(Nara Chandrababu) వ్యవహరించారు.

Published By: HashtagU Telugu Desk
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu 75th Birthday Ap Politics

Nara Chandrababu : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇష్టపడే గొప్ప రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. పాలనా దక్షతలో ఆయనకు ఆయనే సాటి. నాయకత్వ పటిమలో చంద్రబాబుకు ఎవ్వరూ సరితూగరు.  ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన సొంతం. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు అవసరమైన విజన్ చంద్రబాబుకు ఉంది. అందుకే ఆయన నేటికీ, ఎప్పటికీ  జననేత, జయాలను అందుకునే మహా నేత. ఇవాళ (ఏప్రిల్ 20) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన జీవన విజయాలలోని కీలక ఘట్టాల గురించి తెలుసుకుందాం..

Also Read :AP DSC 2025 Notification: సీఎం చంద్ర‌బాబు కానుక‌గా రేపు డీఎస్సీ నోటిఫికేష‌న్‌!

నారావారి పల్లె నుంచి తొలిసారి అసెంబ్లీ దాకా.. 

  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో చంద్రబాబు పుట్టి పెరిగారు.
  • ఆయన చంద్రగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు.
  • రోజూ ఇంటి నుంచి స్కూలుకు మధ్యాహ్న భోజనాన్ని అరిటాకులో పొట్లంలో చుట్టుకొని చంద్రబాబు తీసుకెళ్లేవారు.
  • చంద్రబాబు  తండ్రి కర్జూరనాయుడు రైతు.
  • లెెక్చరర్, ఐఏఎస్, వ్యాపారవేత్త.. ఈ మూడింట్లో ఏదో ఒకటి కావాలని చిన్నప్పుడు చంద్రబాబు కలలు కనేవారు.
  • నారావారి పల్లె గ్రామపెద్దల్లో కర్జూరనాయుడు ఒకరు. తండ్రి ప్రభావంతో చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు వచ్చాయి.
  • తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ చేసేటప్పుడు, విద్యార్థి సంఘ నాయకుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు.
  • నారావారి పల్లె నుంచి పీజీ చేసిన రెండో వ్యక్తి చంద్రబాబే.
  • రాజకీయాల్లోకి వెళ్తే సమాజానికి మంచి చేయొచ్చని యూనివర్సిటీలో చేరాకే చంద్రబాబుకు అర్థమైంది.
  • ఎన్టీఆర్, ఏఎన్నార్‌ సినిమాలను చంద్రబాబు బాగా చూసేవారు.
  • వాలీబాల్, ఫుట్‌బాల్‌ అంటే చంద్రబాబుకు ఇష్టం.
  • చంద్రబాబు ఆర్థికశాస్త్రంలో పీజీ చేశాక, అదే యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా వ్యవహరించారు. అక్కడే లెక్చరర్‌గా ఛాన్స్ వస్తే నో చెప్పారు.
  • 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ తరఫున చంద్రబాబుకు చంద్రగిరి అసెంబ్లీ సీటు దక్కింది. ఆ సమయానికి చంద్రబాబు చేతిలో డబ్బుల్లేవు. తండ్రిని డబ్బు అడిగితే.. మనకెందుకురా రాజకీయాలు అన్నారు.  చివరకు తన కొడుకు చంద్రబాబుకు రూ.1 లక్షను కర్జూరనాయుడు ఇచ్చారు.
  • తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో చంద్రబాబు వినూత్న ప్రచారం చేశారు. విద్యార్థులు, యువతకు ప్రచారంలో ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గంలోని ఓటర్లకు వ్యక్తిగతంగా ఉత్తరాలు రాశారు. ఇదంతా కలిసొచ్చి 28 ఏళ్ల వయసులో చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

Also Read :Jobs In Japan: గుడ్ న్యూస్‌.. తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు!

ఎమ్మెల్యే నుంచి తొలిసారి సీఎం స్థాయికి.. 

  • 1980-1983 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్ననీటి పారుదల తదితర శాఖలకు మంత్రిగా చంద్రబాబు(Nara Chandrababu) వ్యవహరించారు.
  • సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాక తన అభిమాన హీరో నందమూరి తారక రామారావును ఓసారి కలవాలని చంద్రబాబు అనుకున్నారు. ఆయన తనయుడు జయకృష్ణ ద్వారా టైమ్‌ తీసుకున్నారు.
  • ‘అనురాగదేవత’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. చంద్రబాబుతో ఎన్‌టీఆర్ గంటసేపు మాట్లాడారు.
  • చంద్రబాబు వ్యక్తిత్వం ఎన్టీఆర్‌కు నచ్చింది. 1981లో తన కూతురు భువనేశ్వరితో చంద్రబాబుకు పెళ్లి జరిపించారు.
  • పెళ్లి చూపుల్లో చంద్రబాబు.. ‘‘మాది పేద కుటుంబం. ఈ మంత్రి పదవి శాశ్వతం కాదు. మళ్లీ పల్లె జీవితానికి వెళ్లాల్సి రావచ్చు. ఆలోచించి నిర్ణయం చెప్పండి’’ అని  భువనేశ్వరితో చెప్పారట. ఆ మాటల్లోని బోళాతనం, కట్నం ప్రసక్తే వద్దన్న ఆదర్శభావం ఆమెకు చాలా నచ్చాయి. వెంటనే పెళ్లికి అంగీకరించారు. 
  • చంద్రబాబు పెళ్లి ఆనాటి మద్రాసులో జరిగింది. దర్శకుడు దాసరి నారాయణరావు స్వయంగా పెళ్లికొడుకును చేసి, తన ఇంటి నుంచి చంద్రబాబును మండపానికి తీసుకెళ్లారు.
  • 1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో గెలిచి ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోయారు.
  • తదుపరిగా టీడీపీలో చంద్రబాబు చేరారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్టీఆర్‌కు కుడిభుజంగా మారారు.
  • 1984 ఆగస్టులో ఎన్టీఆర్‌ సర్జరీ కోసం ఆమెరికాకు వెళ్లినప్పుడు ఉమ్మడి ఏపీలో రాజకీయ పరిణామాలు మారాయి. అయినప్పటికీ చంద్రబాబు చతురత వల్ల ఎన్టీఆర్‌ తిరిగి సీఎం అయ్యారు.
  • టీడీపీ టికెట్‌పై 1989లో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేసి గెలిచారు.నాటి నుంచి అది చంద్రబాబుకు కంచుకోటగా మారింది.
  • 1995లో టీడీపీలో మళ్లీ పరిణామాలు మారాయి. ఆ ఏడాది సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు.
  Last Updated: 20 Apr 2025, 09:10 AM IST