Hunger Strike : చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి నిరాహార దీక్షలు నేడే

Hunger Strike : గాంధీ జయంతి వేళ ఈరోజు టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నిరాహార దీక్షను ప్రారంభించారు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 07:22 AM IST

Hunger Strike : గాంధీ జయంతి వేళ ఈరోజు టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిరాహార దీక్షను చేపడుతున్నారు. రాజమండ్రిలోని రేణుక రెసిడెన్సీలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమె నిరాహార దీక్ష చేపడతారు. అయితే దీక్ష ప్రారంభానికి ముందు భువనేశ్వరి మీడియాతో మాట్లాడనున్నారు. తమ దీక్షకు కారణం చెబుతూ, ఇలాంటి దీక్ష ఎందుకు అవసరమో భువనేశ్వరి వివరిస్తారు. ఇక నారా లోకేష్ ఢిల్లీలోని టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో రాహార దీక్ష  చేపడుతున్నారు. పలువురు టీడీపీ ఎంపీలు కూడా  ఈ దీక్షలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

Also read : Gold- Silver Prices: బంగారం కొనాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

స్పెషల్ లీవ్ పిటిషన్‌  వాయిదా

చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ పై విచారణను  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) డీవై చంద్రచూడ్ బెంచ్ అక్టోబరు 3కు వాయిదా వేసింది. అంటే రేపు దీనికి సంబంధించిన వాదనలు జరుగుతాయి.  తొలుత ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం వద్దకు వెళ్లగా.. జస్టిస్ భట్టి ఈ పిటిషన్ పై వాదనలు వినడానికి ఒప్పుకోలేదు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేయాలని సీజేఐ వద్ద మెన్షన్ చేశారు. ఇక ఈనెల 14న ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రావాలంటూ నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ ఇటీవల ఏ14గా లోకేష్ పేరును (Hunger Strike)  చేర్చారు.