TDP : తిరువూరు టీడీపీ అభ్య‌ర్థిగా కొలిక‌పూడి శ్రీనివాస్‌.. త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న అధిష్టానం

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌రప‌డుతున్న వేళ రాజ‌కీయ పార్టీలో త‌మ దూకుడిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేల‌ను

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 08:05 AM IST

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌రప‌డుతున్న వేళ రాజ‌కీయ పార్టీలో త‌మ దూకుడిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేల‌ను మార్చి వారి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం ఇస్తుంది. ఇటు టీడీపీలో కూడా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ఇంఛార్జ్‌ల ప‌నితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. దీంతో వారిని పక్క‌న పెట్టాల‌ని అధిష్టానం భావించింది. ఇందులో భాగంగా తిరువూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న శావ‌ల దేవ‌ద‌త్‌ని అధిష్టానం మారుస్తుంది. దేవ‌ద‌త్ ఆర్థికంగా బ‌లంగా లేక‌పోవ‌డంతో పాటు, సీనియ‌ర్ నాయ‌కులు, ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల‌తో విభేదాలు ఉన్నాయి. క్యాడ‌ర్‌ని స‌మ‌న్వ‌యం చేయ‌డంలో దేవ‌ద‌త్ విఫ‌ల‌మైయ్యారు. దీనికి తోడు తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న స్వామిదాస్ వైసీపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.

We’re now on WhatsApp. Click to Join.

స్వామిదాస్‌పై శావ‌ల దేవ‌ద‌త్ అయితే సీటు ఓడిపోతుంద‌ని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో ఇక్క‌డ అభ్య‌ర్థిని మార్చేందుకు పార్టీ సిద్ధ‌మైంది. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షులు కొలిక‌పూడి శ్రీనివాస‌రావుని పోటీ చేయించేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే కొలికపూడి శ్రీనివాస‌రావుపై అధిష్టానం స‌ర్వేలు చేపిస్తుంది. తిరువూరు టికెట్‌పై స్ప‌ష్ట‌త రావ‌డంతో ఆయ‌న టీడీపీలో చేరిన‌ట్లు స‌మాచారం. మ‌రో రెండు మూడు రోజుల్లో కొలిక‌పూడి శ్రీనివాస్ తిరువూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కొలిక‌పూడి.. టీవీ డిబెట్లో రాజ‌ధానిపై త‌న గ‌ళాన్ని వినిపించారు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన శ్రీనివాస‌రావు .. హైద‌రాబాద్‌లో డా. కేస్ రావు ఐఏఎస్ అకాడ‌మీని ఏర్పాటు చేసి ఎందరినో ఐఏఎస్‌,ఐపీఎస్‌ల‌ను తీర్చిదిద్దారు.

Also Read:  Galla Jayadev : గల్లా జయదేవ్‌కు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఫై లోకేష్ కామెంట్స్

2019 త‌రువాత ఏపీలో జ‌రిగిన ప‌రిణామాల‌తో ఆయన అకాడ‌మిని వ‌దిలి అమ‌రావ‌తి ఉద్య‌మంలో పాల్గొన్నారు. త‌న వాక్చాతుర్యంతో అమ‌రావ‌తి రైతుల్లో మ‌నోధైర్యాన్ని నింపారు. ఆ త‌రువాత ఆయ‌న పాద‌యాత్ర కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ అధిష్టానం కొలిక‌పూడికి టికెట్ ఇవ్వాల‌ని భావించింది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ అయిన‌ప్ప‌టికి అక్క‌డ అభ్య‌ర్థి ఉండ‌టంతో ఇత‌ర ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయించాల‌ని అధిష్టానం నిర్ణ‌యించింది.గ‌త 25 ఏళ్లుగా తిరువూరులో టీడీపీ ఓట‌మి పాల‌వ్వ‌డంతో ఈ సారైన ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌రాల‌ని టీడీపీ భావిస్తుంది. ప్ర‌స్తుత ఇంఛార్జ్ దేవ‌ద‌త్ ప‌నితీరు స‌రిగా లేక‌పోవ‌డంతో ఇక్క‌డ అభ్య‌ర్థిని మార్చి కొలిక‌పూడి శ్రీనివాస్‌ని నియ‌మించ‌నున్నారు.