Site icon HashtagU Telugu

Andhra Pradesh : రూ.81 లక్షల విలువైన సెల్‌ఫోన్ల‌ను రికవరీ చేసిన తిరుప‌తి పోలీసులు

Mobile Phones recovery

Mobile Phones recovery

ఏపీ పోలీసులు ప్రవేశపెట్టిన సరికొత్త టెక్నాలజీ ‘మొబైల్ హంట్ యాప్స తో తిరుపతి పోలీసులు సుమారు రూ.81 లక్షల విలువైన 450 చోరీ మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని యజమానులకు అప్పగించారు. రికవరీ చేసిన మొబైల్స్ ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవని అడిషనల్ ఎస్పీ వెంకట్రావు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికుల ఫోన్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఒక నెలలో చోరీకి గురైన 450 మొబైల్స్ రికవరీ చేశామని.. తిరుపతి పోలీసులు 1,630 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేశారని.. వీటి మొత్తం విలువ రూ.2.93 కోట్లు ఉంటుంద‌ని తెలిపారు.

ప్రజలు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 9490617873 (మొబైల్ హంట్ యాప్)కు ఫిర్యాదు చేయాలని అడిష‌న‌ల్ ఎస్పీ వెంక‌ట్రావు ప్రజలను కోరారు. యాప్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత, ఫిర్యాదుదారుడు మొబైల్ వివరాలను అందజేస్తూ ఫిర్యాదు చేసినందుకు లింక్‌తో పాటు రసీదుని పొందుతారని తెలిపారు. మొబైల్ ఫోన్‌లో నిల్వ చేసిన సమాచారం లేదా డేటా దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి పోలీసులు CIER (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సహాయంతో ఫోన్‌ను బ్లాక్ చేస్తారని ఆయన వివరించారు.