Site icon HashtagU Telugu

Bhumana Karunakar : నలుగురు కార్పోరేటర్ల ఎక్కడ ఉన్నారో.. ఏమయ్యారో తెలియదు

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా మారాయి. వరుసగా మున్సిపల్‌ చైర్మన్‌ పదవులను కైవసం చేసుకుంటోంది టీడీపీ. అయితే.. మేయర్‌ పదవుల్లో సైతం టీడీపీ అభ్యర్థులు గెలవడంతో మరింత రాజకీయం రాజుకుంది. అయితే.. వైసీపీ కౌన్సిలర్‌లు, కార్పొరేటర్లు సైతం టీడీపీ అభ్యర్థులకు మద్దుతు తెలపడంతో రాజకీయం వేడెక్కింది.

అయితే.. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికలు వాయిదా వేయడానికి కారణంగా, తమ పార్టీ విజయం సాధించే స్థితి ఉన్నప్పటికీ, కూటమి గెలవడం సాధ్యం కాదని భావించి వాయిదా వేసినట్లు తెలిపారు. “ఎన్నికల కమిషన్ దీనిపై వెంటనే స్పందించాలని కోరుతున్నాం.” అని ఆయన అన్నారు.

Mango: మామిడి పండు తినడానికి ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?

భూమన కరుణాకర్ రెడ్డి, టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టీడీపీ అనుకూలంగా పనిచేసిన ఎన్నికల అధికారిపై ఆయన విమర్శలు చేశారు. “కిడ్నాప్ అయిన కార్పొరేటర్లను తీసుకోవాల్సిన బాధ్యత ఎస్పీ మీద ఉందా?” అని ప్రశ్నించారు. తిరుపతి ఎమ్మెల్యే మదన్ గూండాయిజం చేసి రాజకీయ క్షోభను సృష్టించారని ఆయన ఆరోపించారు.

తిరుపతిలో జరిగిన దౌర్జన్యాలు, బెదిరింపులు, గూండాయిజం గురించి ఆయన మాట్లాడుతూ, “మా పార్టీ తరపున గెలిచిన 48 కార్పొరేటర్లలో కొందరిని బెదిరించి, భయపెట్టి లాక్కున్నారని” చెప్పారు. ఆయన ఇంకా చెప్పినట్లు, “ఉమా, శేఖర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి ఆస్తులపై దాడి చేసిన మంత్రి తిరుపతిలో ఈ దౌర్జన్యాలకు పునాది వేశారని” అన్నారు. కూటమి నేతలపై దాడులు చేసి, కార్పొరేటర్లను బెదిరించి, బస్సులో వెళ్ళిన వారిని కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు.

భూమన కరుణాకర్ రెడ్డి, “నలుగురు కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారో, ఏమి అయ్యారో తెలియదు” అని చెప్పగా, తిరుపతిలో జరిగిన దౌర్జన్యాలను బహిరంగంగా ఆరోపించారు. ఆయన అంటున్నారు, “చిత్తూరులో ఉన్న మా కార్పోరేటర్లను ఎమ్మెల్యే కోడుకు మదన్, ఆయనే అనుచరులు దాడులు చేసి బెదిరించారు.” దౌర్జన్యాలకు సంబంధించి ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు, తిరుపతిలో పెరిగిన రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి.

Jagga Reddy : కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు జగ్గారెడ్డి సవాల్