TTD : తిరుమ‌ల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం.. న‌వంబ‌ర్ నెల‌లో 108 కోట్ల రూపాయ‌ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా హుండి ఆదాయం ల‌భించింది. నవంబర్ నెలలో 108.46 కోట్ల రూపాయల హుండీ

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 06:53 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా హుండి ఆదాయం ల‌భించింది. నవంబర్ నెలలో 108.46 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వ‌చ్చిన‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది. గత నెలలో ఆలయ కార్యకలాపాలను ఈవో ధర్మా రెడ్డి వెల్లడించారు. 19.73 లక్షల మంది భ‌క్తులు ఆల‌యాన్ని సంద‌ర్శించార‌ని.. 97.47 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయని తెలిపారు. 36.50 లక్షల మంది భక్తులు అన్నప్రసాదంలో పాలుపంచుకున్నారని తెలిపారుజ డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు తిరుమలలో జరగనున్న వైకుంట ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, శ్రీవాణి ట్రస్ట్ లింక్డ్ వీఐపీ దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్ బుకింగ్‌కు అందుబాటులో ఉన్నాయని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. అదనంగా, 4.23 లక్షల స్లాట్ సర్వ దర్శనం (ఉచిత దర్శనం) టోకెన్ల జారీ ప్రక్రియను TTD ఖరారు చేస్తోందని తెలిపారు. కాగా. ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్‌లను టీటీడీకి విరాళంగా అందించింది. ఈఓ ధ‌ర్మారెడ్డి, టీటీడీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి జీఎన్‌సీ ఏరియాలో ఏర్పాటు చేసిన పనులను పరిశీలించారు. విండ్ టర్బైన్ ద్వారా ఏటా 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీనివల్ల టీటీడీకి ఏడాదికి రూ.కోటి ఆదా అవుతుందని అంచనా వేశారు. విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గతంలో 15 సంవత్సరాల క్రితం టిటిడి కోసం 1.03 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రెండు విండ్ టర్బైన్‌లను ఏర్పాటు చేసింది.

Also Read:  CM Jagan : పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనులు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశం