Site icon HashtagU Telugu

Tirumala Tiger : అదిగో చిరుత‌..ఇదిగో క‌ర్ర‌.! TTDపై నెటిజ‌న్ల ట్రోల్స్, మీమ్స్ హోరు!!

Tirumala Tiger

Tirumala Tiger

Tirumala Tiger : చిత్త‌శుద్ధి, దేవునిపై ప్రేమ‌, అభిమానం, భ‌క్తి ఉంటే స‌మ‌స్య‌కు మార్గం దొరుకుతుంది. కానీ, అన్య‌మ‌తాన్ని ఆస్వాదిస్తోన్న వాళ్లు టీడీపీ చైర్మ‌న్, ఈవోలుగా ఉంటే చిరుత‌లు మాత్ర‌మే కాదు, పులులు, సింహాలు, ఎలుగ‌బంటులు, న‌క్క‌లు కూడా శ్రీవారి భ‌క్తుల్ని వెంటాడుతాయి. ఎప్పుడూలేని స‌మ‌స్య ఇప్పుడు ఎందుకొస్తుంది? అనేది ఆలోచిస్తే, స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌ళ్లెదుట క‌నిపిస్తుంది. కానీ, త‌న చిన్న‌త‌నంలో తిరుమ‌ల కొండ‌ల్లో చెట్లు ఉండేవి కాద‌ని టీటీడీ చైర్మ‌న్ హోదాలో కరుణాక‌ర్ రెడ్డి ప్ర‌బోధిస్తున్నారు. అంటే, ఇప్పుడు చెట్ల‌ను మొత్తాన్ని నరికేయాల‌ని చెబుతున్న‌ట్టా? అనేది ఎవ‌రికీ ఆయ‌న వాల‌కం అర్థం కావ‌డంలేదు.

క‌ర్ర‌లు చేతిలో ఉంటే చిరుత లేదా పులి వ‌చ్చిన‌ప్పుడు నెత్తిన పెట్టుకోవాల‌ట‌ (Tirumala Tiger)

క‌ర్ర‌లు ప‌ట్టుకుని వెళ్ల‌మ‌ని భ‌క్తులకు స‌ల‌హా ఇస్తున్నారు. అంతేకాదు, మ‌స్ట్ గా క‌ర్ర‌ప‌ట్టుకుని వెళితేనే స్వామి వారి ద‌ర్శ‌నానిక‌రి న‌డిచి వెళ్లాల‌ని నిబంధ‌న పెట్టారు. క‌ర్ర‌కు ప‌ది రూపాయ‌లు అద్దెను ఫిక్స్ చేశారు. ఒక వేళ క‌ర్ర‌ను తిరిగి ఇవ్వ‌క‌పోతే రూ. 150ల జ‌రిమానా పెట్టారు. చైర్మ‌న్ హోదాలో క‌రుణాక‌ర్ రెడ్డి క‌ర్ర‌ల‌ను భ‌క్తుల చేత ప‌ట్టించారు. దానికి మ‌ద్ధ‌తుగా ఈవో ధ‌ర్మారెడ్డి మీడియాలోకి వ‌చ్చేశారు. ఆ క‌ర్ర‌ను ఎలా వాడాలి? అనేది శాస్త్రీయంగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను వింటుంటే న‌వ్వు ఆపుకోలేక సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌టే ట్రోల్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఇంత‌కూ ఆయ‌న చెప్పింది ఏమంటే, ఎత్తుగా ఉండే మ‌నుషుల‌ను చిరుత‌లు (Tirumala Tiger )ఏమీ చేయ‌లేవంటున్నారు. పిల్ల‌ల్ని మాత్ర‌మే దాడి చేస్తున్నాయ‌ట‌. అందుకే, క‌ర్ర‌లు చేతిలో ఉంటే చిరుత లేదా పులి వ‌చ్చిన‌ప్పుడు నెత్తిన పెట్టుకోవాల‌ట‌. అప్పుడు ఎత్తుగా పిల్ల‌లు క‌నిపించ‌డం ద్వారా చిరుత‌, పులి పారిపోతుంద‌ని సెల‌విచ్చారు.

భ‌క్తుల‌ను తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి రాకుండా చేయ‌డానికి కుట్ర

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అగ్ర‌జులు చేస్తోన్న విన్యాసాల‌ను గ‌మ‌నిస్తోన్న నెటిజ‌న్లు గ‌త నాలుగు రోజులుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ర‌కాల మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. వాటిని చూస్తే అగ్ర‌జుల తెలివి ఏ మాత్ర‌మో అర్థ‌మ‌వుతోంది. వాళ్ల‌కు తెలివి లేక కాదు, సమ‌స్య‌కు ప‌రిష్కారం ఇవ్వ‌లేక కాదు..చిత్త‌శుద్ది లేక‌పోవ‌డం ఇలాంటి విన్యాసాల‌కు కార‌ణం. నెటిజ‌న్లు ఒక‌టి మాత్రం డిసైడ్ అయ్యారు. పోతులూరి వీర‌బ్ర‌హ్మేద్రస్వామి చెప్పిన కాల‌జ్ఞాన్ని కోడ్ చేస్తూ ఆరుగురు దొంగ‌ల కార‌ణంగా తిరుమ‌ల మూత‌ప‌డుతుంద‌ని ఫిక్స్ అయ్యారు. ఆ మేర‌కు మీమ్స్ పెడుతున్నారు. ఇక తుపాకులు ఇవ్వండ‌ని కొంద‌రు, ఒక వేళ పులి, చిరుత‌లు (Tirumala Tiger )చ‌నిపోతే దానికి కార‌ణం భ‌క్తులంటూ కేసులు పెడ‌తారా? అంటూ మ‌రికొంద‌రు ఇలా ప‌లు ర‌కాల అనుమానాల‌ను వ్య‌క్త‌ప‌ర‌స్తున్నారు నెటిజ‌న్లు.

ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నీడ‌లో న‌డుస్తోన్న ప్ర‌భుత్వం ఏపీలో

అన్య‌మ‌తాన్ని ఆస్వాదించే అగ్ర‌జులు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీస్తోన్నార‌ని భ‌క్తుల ఆందోళ‌న‌. ఆ మేర‌కు స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. కొంద‌రు తిరుమ‌ల ప్రాంతంలో ధ‌ర్నాల‌కు దిగారు. హిందూమ‌తాన్ని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అనుమానం వ్య‌క్త‌ప‌రిచారు. భ‌క్తుల‌ను తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి రాకుండా చేయ‌డానికి కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఈ ఘ‌ట‌న మీద స్పందించారు. శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డానికి వెళుతున్నారా? భ‌క్తులు పులులు, చిరుత‌ల‌ను (Tirumala Tiger )చంప‌డానికి వెళుతున్నారా? అనే స్థాయికి తిరుమ‌ల పవిత్ర‌త‌ను తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు. ఇక మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు, హిందూమ‌తోద్ధార‌కులు, ఆర్ ఎస్ఎస్, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ త‌దిత‌ర సంస్థ‌లు ముందుకు రావ‌డంలేదు. ఎందుకంటే, ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నీడ‌లో న‌డుస్తోన్న ప్ర‌భుత్వం ఏపీలో ఉంద‌ని న‌మ్ముతున్నారు.

Also Read : Tirumala Forest : జ‌గ‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ `చిరుత‌`లు

స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం గా ఉన్న‌ప్పుడే ఇప్పుడున్న క‌రుణాక‌ర్ రెడ్డి టీటీడీ చైర్మ‌న్ గా ఉన్నారు. ఆయ‌న హ‌యాంలోనే ఏడుకొండ‌లు కాదు, మూడు కొండ‌లు అంటూ ప్ర‌చారం లేపారు. ఇప్పుడు ఏడుకొండ‌ల మీద చెట్లు ఉండేవికాద‌ని, రాళ్లు ర‌ప్ప‌లు మాత్ర‌మే ఉండ‌వ‌ని క‌రుణాక‌ర్ రెడ్డి సెల‌విస్తున్నారు.అంటే , అట‌వీ సంప‌ద అంత‌రించిపోవ‌డాన్ని ప‌రోక్షంగా ప్రోత్స‌హిస్తున్నారు. వాస్త‌వంగా కొన్నేళ్లుగా శేషాచ‌లం అడ‌వుల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ భారీగా జ‌రుగుతోంది. దానికితోడు ఇటీవ‌ల అగ్నిప్రమాదం కార‌ణంగా తిరుమ‌ల కొండల్లోని అడ‌వి అంత‌రించిపోయింది. ఫ‌లితంగా అడ‌వుల్లో ఉండాల్సిన పులి, చిరుత‌లు (Tirumala Tiger )జ‌నంలోకి వ‌చ్చేస్తున్నాయి. ఇటీవ‌ల ఎస్వీయూనివ‌ర్సిటీలోకి కూడా వ‌చ్చేశాయ‌ని న్యూస్.

Also Read : Tirumala : శేషాచలం అడవుల్లో సంచరిస్తున్న మ‌రో 30 చిరుత పులులు – డీఎఫ్‌వో శ్రీనివాసులు

అట‌వీ ప్రాంతాన్ని భ‌ద్రంగా ఉంచితే, జ‌నార‌ణ్యంలోకి పులి, చిరుతలు (Tirumala Tiger )రావ‌ని అట‌వీశాఖ అధికారులు చెబుతున్నారు. ఆ దిశ‌గా ఆలోచించ‌కుండా క‌ర్ర‌లు, క‌త్త‌లు, తుపాకులు ఇవ్వ‌డానికి టీటీడీ సిద్దం కావ‌డంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఫెన్సింగ్ వేయ‌డానికి టీటీడీ సిద్ద‌మ‌వుతుంది. ఇది ఒక ర‌కంగా మంచి ప‌రిణామం అయిన‌ప్ప‌టికీ అడ‌వులను కాపాడ‌డం తొలి ప్రాధాన్యంగా ఉండాలి. క‌ల‌ప స్మ‌గ్లింగ్ ను ఆప‌గ‌ల‌గాలి. రోజంతా గోవింద నామాలు మారుమ్రోగేలా చేస్తే సింపుల్ గా చిరుల స‌మ‌స్య‌ను నివారించడానికి అవ‌కాశం ఉంది. గోవింద నామాల సౌండ్ కు వ‌న్య‌మృగాలు బ‌య‌ట‌కు రాకుండా ఉంటాయ‌ని టీటీడీకి తెలియ‌ని విష‌యం కాదు. గతంలో ఎప్పుడూ గోవింద నామాలు వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు ఏదో నామ‌మాత్రంగా పెట్టేసి వ‌దిలేస్తున్నారు. ఇక్క‌డే టీటీడీ నిర్ల‌క్ష్యం, శ్రీవారి మీద అశ్ర‌ద్ధ క‌నిపిస్తోంది. అందుకే, చిత్త‌శుద్ది ఉండే వాళ్లు టీటీడీకి అగ్ర‌జులుగా ఉండాలి.