Site icon HashtagU Telugu

TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ మార్గాల్లో ఆంక్షలు..

Ttd

Ttd

TTD : తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు ఈ రోజు కీలకమైన సూచనలను జారీ చేశారు. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గంలో కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని, ఈ మార్గంలో భక్తులకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని, అనంతరం విభజన ప్రకారం, గుంపులుగా భక్తులను విడగొట్టి, ఒక్కో బృందంలో 70 నుండి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది చూసుకుంటారని టీటీడీ అధికారులు తెలిపారు.

భక్తులకు బాగా సౌకర్యవంతంగా మార్గం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా 12 ఏళ్ల లోపు చిన్నారులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడక మార్గంలో అడుగు పెట్టకూడదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇక, రాత్రి 9 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేయాలని టీటీడీ ప్రకటించింది.

 PM Kisan 19th Installment: పీఎం కిసాన్ నిధులు.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోండిలా!

ఈ తాజా నిర్ణయాల్ని, తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో భద్రతా చర్యలు కఠినంగా తీసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో చిరుతలు సంచరిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి, అలిపిరి నడక మార్గంలో 7వ మలుపు సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు. ఈ సంఘటన మరింత భయాందోళనకు దారితీసింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది శబ్దాలు చేసి, చిరుతను అడవిలోకి తరిమివేశారు.

భక్తులు తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం గురించి భయపడటంతో, టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మలుపుల దగ్గర, , గుట్టపుట్టల సమీపంలో విజిలెన్స్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు గస్తీ పెంచారు. ఈ చర్యలు భక్తుల భద్రతను కల్పించేందుకు, అలాగే తిరుమలలోని అనేక జంతు సంరక్షణ చర్యలలో భాగంగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల భద్రత, జంతు సంరక్షణ రెండూ దృష్టిలో పెట్టుకుని, టీటీడీ అధికారులు భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేశారు. చిరుతల సంచారం నేపథ్యంలో తిరుమలలో ఉత్పన్నమైన భయానక పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, భక్తులు, అధికారులు కలిసి జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీ సూచించింది.

 Instagram : ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇది ఎందుకంటూ నెటిజన్లు ఆందోళన