Site icon HashtagU Telugu

Tirumala Laddu Controversy: తిరుమ‌ల ల‌డ్డూ వివాదం.. సీబీఐ అదుపులో న‌లుగురు!

Tirumala Laddu Controversy

Tirumala Laddu Controversy

Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో (Tirumala Laddu Controversy) కీలక పరిణామం చోటుచేసుకుంది. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు బృందం న‌లుగురిని అరెస్ట్ చేసింది. భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ (పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ (దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

క్రైమ్‌ నెంబర్ 470/24లో అరెస్టు చేసి తిరుపతి కోర్టులో దర్యాప్తు అధికారులు హాజ‌రుప‌ర్చారు. దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. నెయ్యి సరఫరాలో అడుగడుగునా ఉల్లంఘనలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లను వైష్ణవి డైరీ ప్రతినిధులు ద‌క్కించుకోవ‌టం గ‌మ‌నార్హం. ఎఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథను వైష్ణవి డైరీ న‌డిపించిన‌ట్లు అధికారులు తేల్చారు.

రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారు. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారుల విచార‌ణ‌లో తేల‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సమగ్ర విచారణతో అక్రమాలను దర్యాప్తు బృందం గుర్తించింది. మూడు డైరీలకు చెందిన న‌లుగురిని సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది.

Also Read: India Claim Series: భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం

ఇదీ కేసు నేపథ్యం