Tirumala Laddu : తిరుమల లడ్డు ప్రసాదం అంటే ఒక అమృతం, అద్భుతం. స్వయంగా శ్రీవారే అనుగ్రహించే ప్రసాదమని భక్తుల విశ్వాసం. కానీ నేడు ఈ లడ్డూ ప్రతిష్ఠకు, హిందువుల విశ్వాసాలకు భంగం వాటిల్లేలా ఆరోపణలొస్తున్నాయి. భక్తుల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపుపై ఇప్పుడు నీడ కమ్ముకుంది. నువ్వే ఈ పరిస్థితి నుంచి క్షేత్రాన్ని కాపాడాలంటూ ఆ ఏడుకొండలవాడిని భక్తులు ప్రార్థిస్తున్నారు.
తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు , (Animal Fat ) వాడారని చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై నిన్నటి నుండి భక్తులు, రాజకీయేతర పార్టీల నేతలు జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేమి అంటూ ప్రమాణాలకు సిద్ధం అంటున్నారు.
దీనిపై బిజెపి నేతలు సైతం జగన్ పై ఆగ్రహం చేస్తున్నారు. జంతువుల కొవ్వు, చేప నూనెను తిరుపతి లడ్డూ తయారీలో వాడి మన ధర్మం, దేవుడితో ఆడుకున్నారని BJP మ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) ఆరోపించారు. జగన్ ఒక పాపపు ముఖ్యమంత్రి అని ఆయన దుయ్య బట్టారు. ఈ చర్యతో పవిత్రమైన మన సంప్రదాయాలను అవమానించారన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని కోరారు.
అలాగే బండి సంజయ్ (Bandi Sanjay) సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం అంటే తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని అభిప్రాయపడ్డారు. హిందువులకు జరిగిన ఈ ద్రోహాన్ని దేవుడు క్షమించడని అన్నారు. ఈ లడ్డూ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also : BigBasket: ఎలక్ట్రానిక్ వస్తువుల డెలివరీ ప్లాట్‌ఫామ్‌లోకి బిగ్ బాస్కెట్..!