Tirumala Laddu : తిరుపతి రుయా ఆస్పత్రిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అరెస్టయిన నలుగురు నిందితులకు వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం నిందితులను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో సిట్ అధికారులు పలు అంశాలపై వివరాలు రాబట్టనున్నారు. నేటి నుంచి 18 వరకు విచారణ జరగనుంది. నిందితులు ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్డాను ఐదురోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read Also: KKR-RCB: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్!
కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్.. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్(45), పోమిల్ జైన్(47).. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్(69)ను అరెస్టు చేసింది.
అయితే వీరు కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్, పోమిల్ జైన్ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నలుగురినీ ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో వున్న సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8.20 గంటల సమయంలో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురినీ భారీ భద్రత నడుమ రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9.10 గంటలకు 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి.. నలుగురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్ జైలుకు తరలించారు.
Read Also: BJP : సొంత పార్టీలో వేధింపులు భరించలేక పోతున్న : రాజాసింగ్