Site icon HashtagU Telugu

TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Richest Temples

Richest Temples

TTD : ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యభూమి తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అతి తీవ్రంగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. గత కొన్ని వారాలుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య దాదాపు లక్షల్లోకి చేరుతోంది. ముఖ్యంగా శనివారం, ఆదివారాల లాంటి వీకెండ్‌లలో భక్తుల రాక మరింత పెరుగుతుంది.

ఈరోజు ఆదివారం కావడంతో తెల్లవారుజామున నుంచే శ్రీవారిని దర్శించుకోవాలనే ఉత్సాహంతో వేలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు కంపార్ట్మెంట్లలో క్యూలైన్లలో నిలబడటంతో అన్నీ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి అంచనాల ప్రకారం 20 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ అదే స్థాయిలో ఉండింది. ఆ రోజు మొత్తం 91,720 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం 44,678 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకలతో శ్రీవారి హుండీలో రూ.3.80 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఈ విధంగా తిరుమలలో భక్తుల సంఖ్య త‌ర‌లివ‌స్తుండ‌డంతో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, భోజన వసతులు వంటి అన్ని అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనాల కోసం రిజర్వేషన్లు ముందుగానే పూర్తి కావడం వల్ల టోకెన్ల లేని భక్తులకు క్యూలైన్లు మరింత లంబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తులను క్రమశిక్షణతో, సహనంతో కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

White House : మేం పిలువలే.. పాకిస్తాన్ ఇజ్జత్ తీసిన అమెరికా..