Site icon HashtagU Telugu

Five Burnt Alive : ఐదుగురు సజీవ దహనం.. ప్రైవేట్​ ట్రావెల్స్​ను ఢీకొన్న టిప్పర్

Five Burnt Alive

Five Burnt Alive

Five Burnt Alive : ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.  ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సును టిప్పర్​ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమై మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, టిప్పర్ లారీ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు సజీవదహనమయ్యారని చెప్పారు. మృతులను బాపట్ల జిల్లా నీలాయపాలెం వాసులుగా గుర్తించామన్నారు.

We’re now on WhatsApp. Click to Join

యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే తమకు సమాచారం అందించారని, తాము అగ్నిమాపక సిబ్బందితో కలిసి వచ్చి సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.  డెడ్ బాడీలను(Five Burnt Alive) రికవరీ చేశామన్నారు.  ప్రమాదం జరిగిన బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. చినగంజం, గోనసపూడి, నీలాయపాలెం వాసులు బస్సులో ఉన్నట్లు తేలింది.

Also Read :Pregnancy Tips : మీరు చేసే ఈ తప్పులు గర్భస్రావానికి దారితీస్తాయి

వీరంతా ఏపీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వచ్చారు. పోలింగ్ ముగియడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్‌, బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్‌లో మంటలు రేగి అవి బస్సులోకి వ్యాపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read :AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?