Times Now Survey : టైమ్స్ నౌ స‌ర్వేలోనూ జ‌గ‌న్‌, కేసీఆర్‌

ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. మ‌రోసారి మోడీ ప్రధాని కావ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయ‌ని చెబుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 04:00 PM IST

ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. మ‌రోసారి మోడీ ప్రధాని కావ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయ‌ని చెబుతున్నాయి. అలాగే, ఏపీ, తెలంగాణాల్లో జ‌గ‌న్‌, కేసీఆర్ హ‌వా కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చిన ఇండియా టీవీ, ఇండియా టుడే-సీ ఓట‌ర్ స‌ర్వేతో పాటు మంగ‌ళ‌వారం విడుద‌ల చేసి టైమ్స్ నౌ స‌ర్వేలోనూ అవే ఫలితాలు రావ‌డం గ‌మ‌నార్హం.

ఆగస్టు 15 వరకు టైమ్స్ నౌ జరిపిన సర్వే ప్రకారం లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 17 నుంచి 23 సీట్లు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఇటీవల వచ్చిన ఇండియా టుడే సర్వేలో వైసీపీకి 18 సీట్లు వస్తాయని తేలింది. ఇండియా టీవీ సర్వే ప్రకారం వైసీపీకి 19 ఎంపీ స్థానాలు వస్తాయని అంచ‌నా. దేశంలో ది బెస్ట్ సీఎంలలో వైఎస్ జగన్ ఐదో స్థానంలో ఉన్నారు. ప్ర‌స్తుతం టైమ్స్ నౌ తెలంగాణలో నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ కు 6 నుంచి 10 ఎంపీ స్థానాలు వస్తాయని వివరించింది. ఇటీవలే ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వైసీపీ అనుకూల ఫలితాలు రాగా, తాజాగా టైమ్స్ నౌ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలోనూ జగన్ హవా స్పష్టమైంది.

ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ స‌ర్వేల హ‌డావుడి మొద‌లైయింది. మ‌ళ్లీ కేసీఆర్ తెలంగాణ‌కు కేసీఆర్ సీఎం అవుతార‌ని స‌ర్వేలు చెప్ప‌డం మ‌నుగోడు ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతం ఉప ఎన్నిక కోసం ప్ర‌ధాన పార్టీలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో టైమ్స్ నౌ విడుద‌ల చేసిన స‌ర్వే సంచ‌ల‌నంగా మారింది.