Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన (బుధవారం) పదవి బాధ్యతలను స్వీకరించబోతున్నారు

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 09:36 PM IST

ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు (Chandrababu) శాఖలు కేటాయించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటికే పలువురు మంత్రులు తమ బాధ్యతలు తీసుకొని..తమ పనిని మొదలుపెట్టగా..పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారో అని ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులు తెరపడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన (బుధవారం) పదవి బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పవన్ కళ్యాణ్ పదేళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించాడు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా NDA కూటమి కి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సింగిల్ గా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగాడు. కానీ కేవలం ఒకే ఒక స్థానంలో ఆ పార్టీ నేత విజయం సాధించి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. చివరకు ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత అంత రాజకీయాల నుండి బయటకు వస్తారని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే వెతుకోవాలంటూ ఐదేళ్లు ఎంతో కష్టపడుతూ ప్రజల్లో నమ్మకం మూటకట్టుకున్నాడు.

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుండి ఆయన గెలవడమే కాదు జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. అంతే కాదు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కూడా పవన్ కల్యాణే. అలాంటి పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు కీలక పదవులు అప్పగించారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయితీ,రూరల్ డెవలప్మెంట్ ,రూరల్ వాటర్ సప్లై ,అటవీ శాఖ, పర్యావరణ శాఖలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కల్యాణ్‌కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టు అయింది. ఇంత బాధ్యత పెట్టుకొని సినిమాలు చేస్తాడా..? అనేది ఇప్పుడు చర్చ గా మారింది.

Read Also : Traffic Restrictions : రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు