Site icon HashtagU Telugu

Chandrababu Arrest: స్నేహితుడి అరెస్టును ఖండించిన తుమ్మల

Chandrababu Arrest

New Web Story Copy 2023 09 09t212922.629

Chandrababu Arrest: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు తన చిరకాల స్నేహితుడు మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై స్పందించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అస్సలు జోక్యం చేసుకోని తుమ్మల స్నేహితుడి అరెస్టుని సహించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 20014 లో ఏర్పాటైన స్కిల్ డెవలప్ మెంటులో భాగంగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపింది ఏపీ సీఐడీ. నిన్న శనివారం నంద్యాలలో బాబుని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు శనివారం సిట్ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ మద్దతుదారులు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్లొచ్చని ఏపీ మంత్రులు జోస్యం చెప్తున్న పరిస్థితి.

చంద్రబాబు అరెస్ట్‌పై తుమ్మల నాగేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఎన్ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్షతో ఆయన పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని అన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసే సమయంలో న్యాయసూత్రాలు కూడా పాటించకపోవడం దారుణమని పేర్కొన్నారు. కాగా చంద్రబాబు హయాంలో తుమ్మల మంత్రిగా పని చేశారు.

Also Read: Chandrababu Arrest : లండన్ లో సీఎం జగన్ కు నిరసన సెగ..